
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడిచిన నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ డెన్ నుంచి రాష్ట్రం మొత్తం సరఫరా అయ్యింది నకిలీ మద్యమేనని తేలింది. సేకరించిన గుంటూరు ప్రయోగశాలకు పంపగా.. ఫలితాలను చూసి ఎక్సైజ్ అధికారులే కంగుతిన్నట్లు తెలుస్తోంది.
మొత్తం 45 శాంపిల్స్‌ను పంపగా.. అన్నీ నకిలీ మద్యమేనని తేలింది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో కల్తీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నాణ్యతా ప్రమాణాలు లేకుండా తయారైన ఈ లిక్కర్‌ను రాష్ట్రవ్యాప్తంగా బార్లు, వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా చేశారనే షాకింగ్ విషయం వెలుగు చూసింది.
అలాగే నిందితుల కస్టడీ రిపోర్టులోనూ కీలక వివరాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు దగ్గరుండి మరీ నకిలీ మద్యం తయారు చేసినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ పర్మిషన్ ఉందని కూలీలకు నమ్మబలికి.. ఈ దందాను యధేచ్చగా నడిపించినట్లు తెలుస్తోంది.
