
విజయవాడ: ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలను అమరావతి రాజధాని కోసం సేకరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు బలవంతపు భూ సేకరణ కోసం సిద్ధమైంది. ఎవరైనా భూములు ఇవ్వను అంటే మాత్రం బలవంతంగా లాక్కోవాలని నిర్ణయిచింది. ఈ మేరకు దీనికి ఏపీ కేబీనెట్ ఆమోదం తెలిపింది ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా భూములు ఇవ్వనివారి నుంచి బలవంతంగా లాక్కోవాలని నిర్ణయించారు
గతంలో స్వచ్ఛందంగా భూములు తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు భూమలు ఇవ్వనివారిపై జులుం ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారు. దాంతో రెండో విడతలో భూముల కోసం రైతులకు ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినట్లయ్యింది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటివరకు అమరావతి రాజధాని కోసం సుమారు 79,365 ఎకరాలు భూమిని సేకరించింది. ఇందులో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా, మరో 44,676 ఎకరాలు తాజా భూసేకరణ ద్వారా పొందనున్నారు
రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణ వివరాలు ఇలా..
ల్యాండ్ పూలింగ్ ద్వారా (2014–2019)
34,689 ఎకరాలు 29 గ్రామాల నుంచి రైతుల సహకారంతో సేకరించారు.
రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, విద్య, ఆరోగ్య సదుపాయాలు హామీ ఇచ్చారు.
తాజా భూసేకరణ (2025)
44,676 ఎకరాలు అదనంగా సేకరించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం
గ్రామాలు
తూళ్లూరు మండలం: హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి – 9,919 ఎకరాలు
అమరావతి మండలం: వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల – 12,838 ఎకరాలు
తాడికొండ మండలం: తాడికొండ, కంతేరు – 16,463 ఎకరాలు
- మంగళగిరి మండలం: కాజా – 4,492 ఎకరాలు
గతంలో రైతుల కోసం హామీలు ఇలా..
బలవంతం లేకుండా భూసేకరణ
ప్రోత్సాహక ప్యాకేజీలు
భవిష్యత్తు మౌలిక వసతులపై హామీ
ఇప్పుడు ఇలా..
భూములు ఇవ్వకపోతే బలవంతంగా సేకరించేందుకు నిర్ణయం
ఇదీ చదవండి:
‘చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు’