భారతదేశంలో అతిపెద్ద రిటైల్ రియల్ ఎస్టేట్ ఫ్లాట్‌ఫామ్ అయిన నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ “లేక్స్ ఆఫ్ హ్యాపీనెస్” కార్యక్రమం కింద తన 10వ సరస్సుని పునరుద్ధరించింది. 2022లో ప్రారంభించిన ఈ చొరవ పర్యావరణ అనుకూలమైన కమ్యూనిటీ ఆధారిత పద్ధతులను ఉపయోగించి వచ్చే ఏడాది 2026 నాటికి దాదాపు 15 సరస్సులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ అంతటా దాదాపు 10 సర్సులను పునరుద్ధిరించింది. అందులో సుమారు వందకు పైగా గ్రామాల్లో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారు. హైదరాబాద్‌లో మియాపూర్‌లోని 21 ఎకరాల గురునాథ్ చెరువు సరస్సు పూర్తిగా పునరుద్ధరించబడటమే కాకుండా వినోదం కోసం స్థానిక సమాజానికి అప్పగించారు జల సంరక్షణకారులు ఆనంద్ మల్లిగావాడ్, గున్వంత్ సోనావానేలు.
సాంప్రదాయ పద్ధతులతోనే ఈ సరస్సులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ప్రక్రియను సహజంగా ఉంచడానికి సిమెంట్, ఉక్కుని నివారించారు. ఈ విధానాల వల్ల కరువు ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు 1.5 రెట్లు పెరిగాయి. సుమారు 20 ఎండిపోయిన బావులు తిరిగి నీటితో నింపబడ్డాయి, అలాగే వ్యవసాయ భూములు సైతం పునరుద్ధరించబడ్డాయి కూడా.
పైగా వలస పక్షులు రాకతో జీవవైధ్యం మెరుగుపడింది. అంతేగాదు కుటుంబాలకు ఏడాది పొడవునా తాగునీటి సదుపాయం అందనుంది కూడా. ఈ మేరకు నెక్సస్ సీఈవో దలీప్ సెహగ్ ఈ సరస్సు పునరుజ్జీవింపబడటంతో, నీటిని తిరిగి పొందగలిగాం అన్నారు. ప్రతి సరస్సు కూడా సమాజానికి గుండె అని నెక్సస్ ప్రెసిడెంట్ జయేన్ నాయక్ అన్నారు. దీన్ని ఒక గొప్ప మైలు రాయిగా అభివర్ణించింది బిగ్ పిక్చర్.
(చదవండి: వాట్ హోమ్ మేనేజర్‌కు నెలకు రూ. 1 లక్ష..! సీఈవోలు ఇలానే..)


