వాట్‌ హోమ్‌ మేనేజర్‌కు నెలకు రూ. 1 లక్ష..! సీఈవోలు ఇలానే.. | IIT Bombay Alumnus Pays Rs 1 Lakh A Month To Home Manager Goes Viral | Sakshi
Sakshi News home page

వాట్‌ హోమ్‌ మేనేజర్‌కు నెలకు రూ. 1 లక్ష..! సీఈవోలు ఇలానే..

Nov 17 2025 2:04 PM | Updated on Nov 17 2025 2:43 PM

IIT Bombay Alumnus Pays Rs 1 Lakh A Month To Home Manager Goes Viral

ఇంటిని నిర్వహించడం ఓ కళ. బహుశా అది కూడా ఇప్పుడు ఆదాయ వనరుగా మారిపోతుందేమో. ఇటీవల కాలంలో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మళ్లీ ఇంటిలోని పనులు కూడా నిర్వహించడం అంటే అమ్మో అనేలా ఉంది పరిస్థితి. భార్యభర్తలిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే పర్లేదు..లేదంటే పరిస్థితి కష్టమే. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఓ ముంబై ఐఐటీయన్‌ సీఈవో కేవలం తన ఇంటిని జాగ్రత్తగా చూసుకునేందుకు హోమ్‌ మేనేజర్‌కి ఏకంగా రూ. 1 లక్ష చెల్లిస్తున్నాడట.

మన ఇంటిని వేరోకరు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆఫీస్‌పై దృష్టి పెట్టడం సులభం. అందులోనూ లక్షల్లో సంపాదిస్తే..ఓ వ్యక్తిని పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇక అప్పుడు ఎంచక్కా కెరీర్‌పై దృష్టి పెట్టొచ్చు. అంతేగాదు న్యూయార్క్‌ టైమ్స్‌ రచయిత సాహిల్ బ్లూమ్ నవంబర్ 14న సోషల్‌ మీడియా ఎక్స్‌లో ఇదే విషయమై యాజమాన్యం vs అద్దె గురించి పోస్ట్ చేశారు. 

ఆయన "నా ఇంటికి ఒకే పాయింట్-ఆఫ్-కాంటాక్ట్‌గా ఉండే హోమ్ మేనేజర్‌కి 24/7 యాక్సెస్ పొందడానికి తాను నెలకు రూ. 40 వేలకు పైగా డబ్బుని సంతోషంగా చెల్లిస్తాను" అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. దానివల్ల అన్ని సేవ ఖర్చులు ఒకదాంట్లోనే ఏకీకృతం అవుతాయని చెప్పారు.

పైగా ఇది మంచి లాభదాయకమైన ఉద్యోగం కూడా అని పోస్ట్‌లో జోడించారు. అందుకు ఈ ఐఐటీయన్‌, గ్రేల్యాబ్స్ (ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లతో ఎలా నిమగ్నమవుతాయో మార్చే ఏజెంట్ వాయిస్ AI ప్లాట్‌ఫామ్) వ్యవస్థాపకుడు సీఈవో అమన్ గోయెల్ ఇలా సమాధానమిచ్చారు. "నేను నిజానికి ఫుడ్ ప్లానింగ్, వార్డ్‌రోబ్‌లు, మరమ్మతులు, నిర్వహణ, కిరాణా సామాగ్రి, లాండ్రీ తదితరాలన్నింటిని జాగ్రత్తగా చూసుకునే హోమ్‌ మేనేజర్‌ను నియమించుకున్నాను" అని రాశారు. 

ఆ వ్యక్తి తన ఇంట్లో ప్రతిదీ నిర్వహిస్తాడని, తాను, తన భార్య హర్షిత శ్రీ వాస్తవ తమ వ్యాపారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడతామని అన్నారు. ఈ నిర్ణయం ఇప్పటివరకు మాకు చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి తలనొప్పులు లేకుండా సమయాన్ని ఆదా చేశామనే ఉపశమనం పొందామని సీఈవో అమన్‌ పేర్కొన్నారు. సీనియర్‌ సిటిజన్‌లైన తన తల్లిదండ్రులు తమతో కలిసి ఉంటున్నారని, వారిపై ఈ భారం పడకూడదనే ఇలా చేశానని చెప్పారు. 

ఆ హోమ్‌మేనేజర్‌ వంట దగ్గర నుంచి కిరాణ సామాగ్రి, మరమత్తులు తదితరాలన్నింటిని అతడికి అప్పగించానని, అందుకుగానూ నెలకు రూ లక్ష రూపాయాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ హోమ్‌ మేనేజర్‌ హోటల్‌ చైన్‌లో ఆపరేషన్‌ హెడ్‌గా పనిచేశాడని, చదువుకున్న వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే ఇది కాస్త ఖరీదైనదే అయినా.. టైం ప్రధానం కాబట్టి చెల్లిస్తున్నానని చెప్పారు. 

అయితే నెటిజన్లు  వైరల్‌ పోస్ట్‌ని చూసి వ్యవస్థాపకులు ఇలానే డబ్బుని దుర్వినియోగం చేస్తుంటారని మండిపడగా, మరికొందరు మొత్తం జీవితమంతా ఆఫీస్‌ పనులకే అంకితం చేస్తారా..? వంటవాడిని ఒకడిని పెట్టుకుంటే..మిగతా పనులు మీరు హాయిగా చేసుకుంటే సరిపోయేది కదా అని తిట్టిపోస్తూ.. పోస్టులు పెట్టారు.

(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement