సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదర్‌షాకోట్‌లో కుక్కలు వీరంగం సృష్టించాయి. హిమగిరి కాలనీలో బాలుడిపై నాలుగు కుక్కలు దాడి చేశాయి. ఆడుకుంటున్న వేదాంత్ రెడ్డి(3)ని చుట్టుముట్టిన కుక్కలు విచక్షణారహితంగా కరిచివేశాయి. బాలుడి పరిస్థితి విషమం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై హిమగిరి కాలనీ వాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీధి కుక్కలకు విషం..
ఎన్టీఆర్ జిల్లా: జి. కొండూరు మండలం వెలగలేరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 250 వీధి కుక్కలకు పంచాయతీ సిబ్బంది విషమిచ్చి చంపారు. వీధి కుక్కలను చంపినట్లు రత్న జంతుసేవా సంస్థ సిబ్బంది గుర్తించారు. పంచాయతీ కార్యదర్శిపై జి.కొండూరు పోలీస్ స్టేషన్‌లో రత్న జంతుసేవా సంస్థ ఫిర్యాదు చేసింది. విష పదార్థాన్ని ఉపయోగించి కుక్కలను చంపినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


