కోటప్పకొండ ఘాట్ రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ | Massive Traffic Jam on Kotappakonda Ghat Road | Sakshi
Sakshi News home page

కోటప్పకొండ ఘాట్ రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

Feb 15 2026 10:08 PM | Updated on Feb 15 2026 10:10 PM

Massive Traffic Jam on Kotappakonda Ghat Road

పల్నాడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు భక్తులు పోటెత్తడంతో ఘాట్‌ రోడ్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దాంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండ కిందకి గాని పైకి గాని కదలకుండా వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా గంటల తరబడి అవస్థలు తప్పడం లేదు. 

ప్రధానంగా కోటప్పకొండ నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. దాంతో నరసరావుపేట వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు భక్తులు. కొండ దిగుభాగంలో పూర్తిగా వాహనాలు ప్యాక్‌ అయిపోవడంతో ట్రాఫిక్‌ను కంట్రోల్‌లో తీసుకురావడం కష్టతరంగా మారింది. ఇది క్లియర్‌ కావడానికి మరికొన్నిగంటలు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. 

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement