డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో బెంగళూరుకు చెందిన ఒక మహిళ దారుణంగా మోసపోయింది. సైబర్ క్రైమ్ విభాగం, ఆర్బీఐ, సీబీఐ అంటూ నెల రోజులు పాటు వేధించి కోట్ల రూపాయలను దోచుకున్నారు.
బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ ‘‘డిజిటల్ అరెస్ట్" స్కామ్‌లో చిక్కుకుంది. నెల రోజులపాటు ఆమెను వర్చువల్ కస్టడీకి పరిమితం చేశారు సైబర్ నేరగాళ్లు. కొరియర్ DHL సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సీనియర్ అధికారులం అంటూ నమ్మించి భయ భ్రాంతురాల్ని చేశారు.
నవంబర్ 14న దాఖలు చేసిన FIR ప్రకారం 2024 సెప్టెంబర్ 15న ఆమెకు ఒక కొరియర్ వచ్చినట్టు వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ముంబైలోని అంధేరి నుండి ఆమె పేరు మీద బుక్ చేసుకున్న ప్యాకేజీలో నాలుగు పాస్‌పోర్ట్‌లు, మూడు క్రెడిట్ కార్డులు , MDMA వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే తాను ముంబైకి ప్రయాణించలేదని మొత్తుకుంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇది సైబర్ క్రైమ్ కేసు కిందికి వస్తుందని భయపెట్టారు. ఏంజరిగిందో ఆలోచించుకునే లోపే సీబీఐ అధికారులు అంటూ మరో కాల్ వచ్చింది. మీరు పెద్ద నేరమే చేశారు, మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు . అంతేకాదు దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకూడదని కూడా హెచ్చరించారు. రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. దుర్భాషలాడారు. ఆమె ఫోన్ యాక్టివిటీ , లొకేషన్ గురించి తెలుసని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే తాము చెప్పినట్టు చెయ్యాలని పట్టుబట్టారు. నకిలీ సీబీఐ ఆఫీసర్లు, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నకిలీ లేఖలను కూడా సమర్పించారు. స్కైప్ ద్వారా రోజువారీ నిఘాలో ఉంచారు. దీంతో కుటుంబ భద్రతకు భయపడి, బాధితురాలు ఆమె అడిగిన డబ్బును చెల్లించేందుకు ఒప్పుకుంది.
దీన్నుంచి బయట పడాలంటే RBI కింద ఉన్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ద్వారా ధృవీకరణ కోసం ఆమె ఆస్తులు, బ్యాంకు ఖాతాలను వివరాలను సమర్పించడం ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారు. చెప్పబడింది. సెప్టెంబర్ 24-అక్టోబర్ 22, 2024 మధ్య అన్ని బ్యాంకు వివరాలను అందజేసింది. ఈ ఆస్తులకు 90 శాతం క్లియరెన్స్ కావాలంటే కొంత సొమ్మును డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత దీనికి అదనంగా రూ. 2 కోట్లు పూచీకత్తుగా డిపాజిట్ చేయాలని, పన్నులు ఇంకొంత సొమ్మును లాక్కున్నారు. ఇలా మొత్తంగా, 187 లావాదేవీల్లో ఆ మో రూ. 31.83 కోట్ల విలువైన డబ్బును బదిలీ చేసింది. ఈ స్కామ్ ప్రధానంగా ఆమె మొబైల్ నంబర్‌కు కాల్స్, నిరంతర పర్యవేక్షణ ద్వారా జరిగింది.డిసెంబర్ 1 ఆమెకు నకిలీ క్లియరెన్స్ లెటర్ వచ్చింది. దీంతో డిసెంబర్ 6న ఆమె కొడుకు నిశ్చితార్థాన్ని కార్యక్రమాన్ని ముగించింది.
కానీ విపరీతమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనైంది. ఫలితంగా నెలరోజుల పాటు అనారోగ్యానికి గురైంది. 2025 ప్రారంభం దాకా స్కామర్ల దందా కొనసాగింది. అడిగిన ప్రతీసారి డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వచ్చేస్తామని హామీ ఇస్తూనే వచ్చారు. చివరికి 2025 మార్చిలో అకస్మాత్తుగా వారి మొత్తం కమ్యూనికేషన్ బంద్ అయింది. ఒక వైపు తన అనారోగ్యం, మరోవైపు కొడుకు పెళ్లి, కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


