పూంచ్‌లోని ఎల్‌ఓసీని దాటివచ్చిన పాకిస్తాన్ డ్రోన్
అనుమానిత పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి , మాదకద్రవ్యాల జారవిడత
భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని చాటుకుంది. గురువారం పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ప్రమాదకరమైన పదార్థాలతో నిండిన బ్యాగ్‌ను భారత సైన్యం చ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానవరహిత వైమానిక వాహనం భారత గగనతలంలోకి ప్రవేశించి ఐదు నిమిషాలకు పైగా ఉండి, చక్కన్ దా బాగ్ ప్రాంతంలోని రంగర్ నల్లా, పూంచ్ నది సమీపంలో దాని పేలోడ్‌ను పడవేసిందని అధికారులు తెలిపారు. ఇందులోఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి), మందుగుండు సామగ్రి, మాదక ద్రవ్యాలున్నాయని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఖాదీ కర్మదా ప్రాంతంలో భారత భూభాగంలోకి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ కొన్ని అనుమానిత పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను జారవిడిచింది. ఇవి ఈ ప్రాంతంలోని ఉగ్రవాద గ్రూపులకు సహాయం చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాలో భద్రతా సమస్యలను లేవనెత్తింది.
ఇదీ చదవండి: స్మోకింగ్ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి?
A Pakistani drone crossed into Indian territory along the Line of Control (LoC) in Jammu and Kashmir’s Poonch, and dropped suspected explosive material, ammunition and narcotics, prompting massive search operations by security forces.
Details.https://t.co/7eLEMRzdVp pic.twitter.com/EWCYJSedMm— Vani Mehrotra (@vani_mehrotra) January 1, 2026
ify"> డ్రోన్ కదలికను గుర్తించిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఖాదీ కర్మదా , పరిసర ప్రాంతాలలో విస్తృతమైన కార్డన్ సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించారు. అదనంగా, భద్రతా దళాలు పఠాన్‌కోట్-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట కథువా, సాంబా, జమ్మూ, ఉధంపూర్ జిల్లాల్లోని వాహన తనిఖీలను ముమ్మరం చేశాయి. నూతన సంవత్సర వేడుకలకు ముందు జమ్మూ ప్రాంతం అంతటా భద్రతను పెంచిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
ఇదీ చదవండి: ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు


