
సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు
కన్వెన్షన్ సెంటర్లకు భూమి ఇచ్చేందుకు అంగీకారం
రాష్ట్రంలో మరో 4 పోర్టుల నిర్మాణం
ఈస్ట్‌కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాజధాని మాస్టర్ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా భూ సేకరణ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అథారిటీ 52వ సమావేశం జరిగింది. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా నదిలోని ద్వీపాలను అభివృద్ధి చేసి టూరిజాన్ని ఆకర్షించేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, ఎనీ్టఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహదపడుతుందన్నారు.
ప్రజారోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు ఏడు దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలకు భూములిచ్చేందుకు సీఎం అంగీకరించారు.
రాష్ట్రంలో మరో 4 పోర్టుల నిర్మాణం
రాష్ట్రంలో 6 పోర్టులు ఉండగా.. లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి కోసం మరో 4 పోర్టులను ప్రభుత్వం నిరి్మస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (జీఎఫ్‌ఎస్‌టీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈస్ట్‌కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. 62 కార్గో హ్యాండ్లింగ్ సంస్థల సీఈవోలతో జరిగిన సమావేశానికి హాజరై స్టార్టప్ స్టాళ్లను పరిశీలించారు.
ఎరువుల విషయంలో ఆందోళన వద్దు
ఎరువుల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై సీఎం బాబు సమీక్షించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.