విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం, నవంబర్ 4వ తేదీ) చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్పెస్ అయ్యింది. జగన్ పర్యటించే గ్రామాల్లో బ్యారికేడ్లు అడ్డంపెట్టినా, గ్రామస్తులను కూడా కదలనీయకుండా చేసి వేధింపులకు గురి చేసినా, ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించాలని చూసినా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది.

కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావితమైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటన సాగింది. దాంతో గ్రామస్తులను, రైతులను అడ్డుకోవాలని పోలీసులు చూశారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తన్న ఏపీ పోలీస్ యంత్రాంగం.. జగన్ పర్యటనను విజయవంతం కాకుండా చూడాలని ఎప్పటిలానే ప్రయత్నాలు చేసింది.


కానీ వారు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. వీటిని గ్రామస్తులు, రైతన్నలు, యువత, మహిళలు ఎవరూ లెక్కచేయలేదు. తమ జననేత జగనన్న వస్తున్నాడని తెలిసి ఊరూ-వాడా ఏకమై కదిలారు. జగనన్నకు సంఘీభావం తెలుపుతూ జై జగన్ నినాదాలతో హెరెత్తించారు.
రైతన్నలకు భరోసా..
వైఎస్ జగన్ పడిపోయిన పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జనసంద్రం.. ఐదు గంటల ఆలస్యం
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. విజయవాడ నుండి గొల్లపాలెం వరకు అడుగడుగునా భారీ జనసందోహమే కనిపించింది. దాంతో ఆ భారీ జనసందోహనికి అభివాదం చేస్తూ జగన్ పర్యటన ముందుకు సాగింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ పర్యటన ఆలస్యమైంది. సుమారు ఐదు గంటలు ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ జగన్ కోసం రైతులు, మహిళలు, కార్యకర్తలు వేచి చూడగా, పొలాల్లో నుండి సైతం వచ్చి జగన్‌ను కలిశారు రైతన్నలు. తుపానుతో తాము నష్టపోయిన విషయాలను జగన్‌కు వివరించారు.

ఇదీ చదవండి:


