యూకేలో మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు
వేంపల్లె/కడప కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటన్‌లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, ఎల్.ఎన్.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్‌లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కువైట్‌లో మెగా రక్తదానం
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్‌లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్. ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మీ ప్రసాద్ యాదవ్, షేక్ రహమతుల్లా, షేక్ అఫ్సర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.


