సాక్షి, తాడేపల్లి : రేపు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా కుంచనపల్లిలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ప్రజల్లో రియలైజేషన్ మొదలైంది. చంద్రబాబు మాయ మాటలు నమ్మినందుకు ప్రజలే బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నందుకు జనం ఆవేదన పడుతున్నారు. మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే. మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని అన్నారు.
శ్రీకాళహస్తి..
శ్రీకాళహస్తి లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు
కేక్ కట్ చేసిన మధుసూదన్ రెడ్డి
వైఎస్సార్‌సీపీ ఆఫీసు నుంచి రామసేతు బ్రిడ్జ్ మీదుగా నెహ్రు వీధిలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ.
వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణి, కళాకారులకు డప్పులు వాయిద్యాలు పంపిణీ చేసిన మధుసూదన్ రెడ్డి.


