ర్యాపిడో కుర్రాడు.. ర్యాపర్‌ అయ్యాడు.. | Hyderabad-based Rapido driver Bharat Kumar became a rapper | Sakshi
Sakshi News home page

ర్యాపిడో కుర్రాడు.. ర్యాపర్‌ అయ్యాడు..

Nov 17 2025 5:09 PM | Updated on Nov 17 2025 5:09 PM

Hyderabad-based Rapido driver Bharat Kumar became a rapper

అతనో ర్యాపిడో రైడర్‌.. అయితే మంచి ర్యాపర్‌ కావాలనేది అతని లక్ష్యం. కుటుంబ పోషణకు ర్యాపిడో నడుపుతున్నప్పటికీ.. తను ఎంచుకున్న రంగంలో వెనుకడుగు వేయకుండా లక్ష్యం వైపు కదులుతున్నాడు. బస్తీ హిప్పాప్‌ పేరిట అనేక పాటలు పాడి హైదరాబాద్‌ బస్తీ యువతకు, సోషల్‌ మీడియాలో సంగీత ప్రియులకు చేరువయ్యాడు భాగ్యనగరానికి చెందిన భరత్‌కుమార్‌. 

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలోని నేరెడ్‌మెట్‌ ప్రాంతంలోని కాకతీయ నగర్‌కు చెందిన భరత్‌కుమార్‌ ర్యాపిడో రైడర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి రిటైర్‌ ఎంప్లాయి. కుటుంబ పోషణకు ర్యాపిడో నడుపుతున్నాడు. తాను సంపాదనలో కొద్ది మొత్తాన్ని ఎంతో ఇష్టపడే ర్యాపర్‌ రంగంలో స్థిరపడేందుకు ఖర్చుచేసుకుంటాడు. 

ఇప్పటికే తనదైన శైలిలో అనేక మాస్‌ పాటలు పాడి బస్తీవాసులు, నగరంలోని సంగీత ప్రియులకు చేరువయ్యాడు. బస్తీ హిప్పాప్‌ పేరిట పాడిన పాటలకు యూట్యూబ్‌లో లైక్స్‌ వ్యూస్‌తో ముందుకు సాగుతున్నాడు. ‘హైదరాబాద్‌ పేరిట, టిల్లుగా మందు తీసుకురా’.. అంటూ పాడిన పాటలు మాస్‌ జనాల నుంచి మంచి ఆదరణ పొందాయి. 

గల్లీ యువతకు చేరువగా.. 
హైదరాబాద్‌ గల్లీల్లోని యువత ఆలోచనలను తన పాటల ద్వారా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి తనదైన శైలిలో మాస్‌ జనాన్ని ఆకట్టుకుంటున్నాడు ర్యాపర్‌ భరత్‌. ‘స్నేహితుల అండతో సమాజాన్ని మేల్కొలిపే పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను.. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ఫాలో అవుతూ, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న అంశాలను పాటలుగా తీసుకొస్తాను, భవిష్యత్తు తరాన్ని, సమాజాన్ని మేల్కొలిపే పాటలతో ప్రజల మన్ననలు పొందాలనేదే నా ఆకాంక్ష అని’ భరత్‌ చెబుతున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement