సాక్షి, విజయవాడ: గ్రామ సచివాలయాల పేరు మార్పుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. క్రెడిట్ చోరీ కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ ఆవిష్కరించిన వ్యవస్థ పేరు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజన్ యూనిట్‌గా మారుస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
వైఎస్ జగన్ విజన్‌ని తన విజన్గా పేరు మార్పు చేయడానికి చంద్రబాబు నిర్ణయించారు. గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకు పాలన తెచ్చిన వైఎస్ జగన్.. దేశంలో ఎక్కడాలేని అద్భుత వ్యవస్థను తీసుకువచ్చారు. పారదర్శకమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తెచ్చారు.
లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగులను వైఎస్ జగన్ నియమించారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల్లో వైఎస్ జగన్ చెరగని ముద్ర వేశారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థకి చంద్రబాబు.. పేరు మార్పుకు నిర్ణయించారు. వైఎస్ జగన్ క్రెడిట్‌ని చోరీ కోసం సీఎం చంద్రబాబు తంటాలు పడుతున్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్


