సాక్షి, గుంటూరు: ఏపీలో మరో ఐపీఎస్ అధికారిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు పంపించింది. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో లోకేష్‌ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ నోటీసులు ఇచ్చింది. రేపు(డిసెంబర్ 23, మంగళవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అమ్మిరెడ్డికి శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ నోటీసులు పంపింది.
13 మందిపై అక్రమ కేసులు
శ్రీసత్యసాయి జిల్లా: ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలొ వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు చేసుకున్న 13 మందిపై కేసులు నమోదు చేశారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. 8 మంది వైఎస్సార్‌సీపీ నేతలకు ధర్మవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


