అధికార పార్టీలో ఆందోళన
ఆయన పర్యటనపై కేసులు కట్టాలని పోలీసులకు ఆదేశాలు జగన్ వస్తున్నారని హడావుడిగా పోలీస్ 30 యాక్ట్ అమలులోకి అప్పటికప్పుడు వైఎస్సార్ సీపీ నేతలకు నోటీసులు ఇచ్చే యత్నం
అంబటి బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనపై కేసులు పెట్టేందుకు రంగం ప్రభుత్వం సిద్ధం అయ్యింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఆరేడు గంటలపాటు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా చోద్యం చూసిన పోలీసులు ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నట్లు షెడ్యూల్ విడుదల కాగానే ఆఘమేఘాలపై సెక్షన్ 30అమలులో ఉందని, ఎటువంటి ర్యాలీలు, సభలు పెట్టడానికి అనుమతి లేదంటూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఒకరిద్దరికి నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారు తీసుకోలేదు.
గుంటూరు లీగల్: వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ బెయిల్ పిటిషన్‌పై వెలువడే ఉత్తర్వులపై ఆసక్తికరమైన చర్చ న్యాయ వర్గాల్లో కొనసాగుతుంది. సామాన్యు ప్రజానీకంలో కూడా చర్చనీయాంశంగా మారింది.
అధికార పార్టీలో ఆందోళన


