‘వైఎస్‌ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’ | Sajjala RamaKrishna Reddy Teleconference with Key YSRCP Leader | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’

Apr 3 2026 6:54 PM | Updated on Apr 3 2026 7:14 PM

Sajjala RamaKrishna Reddy Teleconference with Key YSRCP Leader

తాడేపల్లి : తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్ నాయుడిని తొలగించాలంటూ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. 

ఈ రోజు(శుక్రవారం, ఏప్రిల్‌ 3వ తేదీ) వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. 

రాజధానిపై మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది..
‘రాజధాని అంశానికి సంబంధించి మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది. అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు గ్రోత్ కారిడార్‌గా మెగా సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాన్-బీ ద్వారా తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యం. అమరావతి అప్పులు రాష్ట్రంపై భారంగా మారుతున్నాయి.  వైఎస్‌ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’ అని సజ్జల సూచించారు.

ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి..
ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల. బీఎల్‌వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ‘ పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తవుతోంది. 18 లక్షల క్రియాశీల సభ్యత్వం మా లక్ష్యం. ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా అందింది.  త్వరలో వారందరికీ ఐడీ కార్డులను పంపిణీ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో క్యాంపెయినింగ్ పెంచాలి’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement