సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తలుపు కొట్టి దాహమని నీళ్లు అడిగి ఇంట్లోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. మహిళ మెడపై కత్తి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


