అసిస్టెంట్‌ మలేరియా అధికారులుగా పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ మలేరియా అధికారులుగా పదోన్నతి

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

అసిస్టెంట్‌ మలేరియా అధికారులుగా పదోన్నతి

అసిస్టెంట్‌ మలేరియా అధికారులుగా పదోన్నతి

అసిస్టెంట్‌ మలేరియా అధికారులుగా పదోన్నతి ● ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పీహెచ్‌సీలో పనిచేస్తున్న జజ్జారావు విజయభాస్కర్‌కు అసిస్టెంట్‌ మలేరియా అధికారిగా పదోన్నతి ఇచ్చి ఒంగోలు జిల్లా మలేరియా కార్యాలయానికి బదిలీ చేశారు. ● పల్నాడు జిల్లా నాదెండ్ల పీహెచ్‌సీలో పనిచేస్తున్న మాతంగి భూపతిరావుకు పదోన్నతి ఇచ్చి మాచర్ల డెప్యూటీ డీఎంఓ కార్యాలయానికి బదిలీ చేశారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిఽధిలో ఎంపీహెచ్‌ఈఓలుగా పనిచేస్తున్న ఇరువురికి అసిస్టెంట్‌ మలేరియా అధికారులుగా (ఏఎంఓ) పదోన్నతి లభించింది. గురువారం గుంటూరులోని ఆర్డీ కార్యాలయంలోఉత్తర్యులు అందజేశారు.

ఆరుగురికి హెడ్‌నర్సులుగా పదోన్నతి...

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్న ఆరుగురికి హెడ్‌నర్సులుగా పదోన్నతి ఇచ్చారు. వీరిలో గుంటూరు జీజీహెచ్‌కు నలుగురిని, నెల్లూరుకు ఇరువురిని ప్రమోషన్‌ ఇచ్చి బదిలీ చేశారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఆర్డీ డాక్టర్‌ జి.శోభారాణి, డెప్యూటీ డైరక్టర్‌ బెజ్జం పాల్‌ప్రభాకర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్లు సత్యం, రామకృష్ణ, సీనియర్‌ అసిస్టెంట్స్‌ శ్రీకాంత్‌, గాబ్రియేల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement