ప్రజాబలం
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు ఒక పక్క ఘన స్వాగతం పలుకుతూనే.. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై ప్రజలు మండిపడ్డారన్నారు. అందుకే స్వచ్ఛందంగా కార్యకర్తలు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ జగన్ పర్యటనను దిగ్విజయం చేశారన్నారు. అంబటి కుటుంబానికి అండగా ఉంటామని స్వయంగా వైఎస్ జగన్ భరోసానిచ్చారని, రానున్న రోజుల్లో ఇంతకు ఇంత దీనికి బాధ్యులు న్యాయ, చట్టపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ఇది కదా..
వైఎస్ జగన్ పర్యటన విజయవంతంపై వైఎస్సార్‌సీపీ నేతలు
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా బుధవారం నగరంలోకి ప్రవేశించిన తరువాత 5 కిలోమీటర్లు..7 గంటలపాటు కొనసాగిందంటే ఆయనపై ఎంతటి ప్రజాభిమానం ఉన్నదో తెలుస్తుందని హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ గూండాలు అంబటి నివాసంపై జరిపిన దమనకాండను మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు. మహిళలు, చిన్నారులు ఉన్నారని అని కూడా చూడకుండా, ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా భయానక వాతావరణం సృష్టించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంబటి నివాసం వద్ద అంతటి ఘోరం జరుగుతుంటే.. ఎస్పీ, ఐజీ, డీజీపీలు ఫోన్‌లు కూడా ఎత్తకపోవటం దారుణమన్నారు. వైఎస్ జగన్ గుంటూరుకు వస్తుంటే ఆపేందుకు పోలీసులను ఉపయోగిచారని, అదే అంబటి నివాసం వద్ద ఆ పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రతి దారుణాన్ని డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సమావేశంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్, నేతలు షేక్ గులాంరసూల్, పానుగంటి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.


