తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!
పరీక్ష గది తలుపులు మూసి ... తాళాలు వేసి
మాస్ కాపీకి ఊతమిచ్చేలా నర్సింగ్ పరీక్షల నిర్వాహాకులు నర్సింగ్ పాఠశాలలోకి ఎవరూ ప్రవేశించకుండా తలుపులకు తాళాలు వేసి నర్సింగ్ విద్యార్థినులతో పరీక్షలు రాయించడం పలు అనుమానాలకు తావునిచ్చింది. స్క్వాడ్ వస్తే తలుపులు తీయకుండా ముందస్తుగా సమాచారం చేరవేసి అనంతరం వారిని లోపలకు అనుమతించేలా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
నర్సింగ్ విద్యార్థినులు చూసిరాతకు పాల్పడుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి మీడియా తీసుకెళ్లడంతో సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ నర్సింగ్ పాఠశాలలో తనిఖీలు చేశారు.
విద్యార్థినులు మంచిగా పరీక్షలు రాసి ఉన్నత స్థితికి చేరుకోవాలని మాస్ కాపీకి పాల్పడి భవిష్యత్‌ను బలి చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.
జీఎన్‌ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న నర్సింగ్ విద్యార్థినులు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లోని ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలలో గురువారం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) వార్షిక థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు నర్సింగ్ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించే తరగతి గదులు ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలలో లేకపోవడంతో నర్సింగ్ విద్యార్థినులకు చూసి రాతకు అవకాశం కల్పించినట్లయింది.
తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!
తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!


