సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.
ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.
23.12.2025(మంగళవారం) షెడ్యూల్:
సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
24.12.2025(బుధవారం) షెడ్యూల్:
ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్‌లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు
25.12.2025(గురువారం) షెడ్యూల్:
ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.



