చిన్నారికి వైఎస్‌ జగన్‌ అక్షరాభ్యాసం | YS Jagan Perform Aksharabhyasam For Child | Sakshi
Sakshi News home page

చిన్నారికి వైఎస్‌ జగన్‌ అక్షరాభ్యాసం

Feb 12 2026 4:45 PM | Updated on Feb 12 2026 5:08 PM

YS Jagan Perform Aksharabhyasam For Child

సాక్షి, తాడేపల్లి: చిన్నారికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్షరాభ్యాసం చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్సార్సీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు కోరారు.

తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్‌కు అక్షరాభ్యాసం చేసి.. ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్‌ కుటుంబ సభ్యులు.. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్‌ అన్నప్రాసన చేశారని  లెనిన్ కుటుంబం గుర్తుచేసుకున్నారు.

Tadepalli: చిన్నారికి YS జగన్ అక్షరాభ్యాసం

Advertisement
 
Advertisement
Advertisement