పెయింటింగ్స్‌లో అనేక రకాల పద్ధతులు ట్రెండ్ అవుతున్న నేటి తరుణంలో వినూత్నంగా నైఫ్ ఆర్ట్‌తో చిత్రాలకు జీవం పోస్తూ కళాభిమానుల మన్ననలు పొందుతున్నాడు. పెయింటింగ్ కదలిక, లోతుతో సజీవంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పద్ధతిని అనుసరిస్తున్నానని శివకుమార్ చెబుతున్నాడు.
చిత్రకళలో నైఫ్ ఆర్ట్ వినూత్నంగా నిలుస్తుందని, గత కొన్ని రోజులుగా నైఫ్ ఆర్ట్ అని పేరుపెట్టి తాపీ మేస్త్రీలు వాడే వాటితో పెయింటింగ్ వేస్తున్నారు. శివకుమార్ కూడా తనదైన శైలిలో చిత్రాలు గీస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
నా కళాత్మక వ్యక్తీకరణలో ఈ ‘నైఫ్’ పెయింటింగ్ ముఖ్యమైన భాగంగా మారింది. బ్రష్‌లకు భిన్నంగా నైఫ్ (పాలెట్)తో సజీవంగా చిత్రాలను గీయడంపై దృష్టి పెట్టాను. ఒకటి గీసిన తర్వాత భాగా అనిపించి.. ఇలాంటి చిత్రాలే గీస్తూ వస్తున్నా. ఇదో కొత్త అనుభూతి.
మందపాటి నైఫ్ భారీ యాక్రిలిక్ పెయింట్లను కలిపి చిత్రాలకు రంగులద్దుతుంటాను. భావాలను వ్యక్తీకరించేందుకు వినూత్న పద్ధతులను అన్వేషిస్తుంటాను. ఇప్పటి వరకూ అనేక చిత్రాలు వేశానని తెలంగాణ రాష్ట్రం గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ విశ్రాంత ఆర్ట్ టీచర్ శివకుమార్ చెబుతున్నారు.
(చదవండి: ర్యాపిడో కుర్రాడు.. ర్యాపర్ అయ్యాడు..)


