హైదరాబాద్ సరికొత్త ఈవెంట్‌కు వేదికగా నిలవనుంది. ఆర్ట్ కనెక్ట్ ఆధ్వర్వంలో సరికొత్త కాంటెపరరీ నౌ అనే కళాత్మక కార్యక్రమం జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 34 మంది సీనియర్ కళాకారుల కళలను ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో తొలిసారి ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ ప్రదర్శన నవంబర్ 21 నుంచి 25 వరకు ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియో సమీపంలో ఉన్న స్పిరిట్ కనెక్ట్‌లో జరగనుంది.
ఈ ఈవెంట్‌లో చెన్నైకి చెందిన అశ్వితాస్‌తో కలిసి ఓజాస్ ఆర్ట్, అసైన్, ఆర్చర్ ఆర్ట్ గ్యాలరీ, ఆర్ట్ అలైవ్ గ్యాలరీతో కలిసి ఆర్ట్ షోను ఆర్ట్ కనెక్ట్ హైదరాబాద్ ప్రదర్శించనుంది. ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు.. కళలను ప్రతిబింబించడానికి, ప్రారంభించడానికి ఇదొక ఆహ్వానమని ఆర్ట్ కనెక్ట్ వ్యవస్థాపకురాలు, రానా సతీమణి మిహీకా దగ్గుబాటి తెలిపారు.

ఈ సందర్భంగా అశ్విత డైరెక్టర్ అశ్విన్ ఈ రాజగోపాలన్ మాట్లాడుతూ.. 'ఆర్ట్ కనెక్ట్‌తో మా సహకారం ఆలోచనాత్మక, సాంస్కృతిక సంభాషణకు భాగస్వామ్యంలాంటిది. జ్ఞాపకశక్తి, గుర్తింపు, రూపంతో మాట్లాడే రచనలను ఎదుర్కొనే అరుదైన అవకాశాన్ని కాంటెంపరరీ నౌ అందిస్తుందని' అన్నారు.


