breaking news
Miheeka
-
పావుకిలో టమాట రూ.850, పుట్టగొడుగు రూ.5 లక్షలు.. రానా షాప్‌లో రేట్లు ఎక్కువే!
చాలామంది ఇప్పుడు ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా (Rana Daggubati) దంపతులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫుడ్ స్టోర్స్ అనే షాప్‌ను జనవరిలో ప్రారంభించారు. ఇక్కడ కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా అన్నీ దొరుకుతాయి. అయితే అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి. బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటంస్ ఈ చోట లభించడం విశేషం.ఖరీదైన కూరగాయలుఈ ఫుడ్ స్టోరీస్‌లో స్మూతీస్, జ్యూస్, కాఫీ, చాక్లెట్స్, నూడుల్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్‌లు, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఆరు కిలోల మష్రూమ్ ఈ ఫుడ్ స్టోరీస్‌లో ఉంది. దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు. మామూలు పుట్టగొడుగులు 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంది. కొబ్బరి బోండా వెయ్యి రూపాయలుకూరగాయల్ని సైతం విదేశాలనుంచి తీసుకొస్తారు. మెక్సికో, స్పెయిన్, నెదర్లాండ్స్.. ఇలా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేస్తారు. ఉదాహరణకు నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములకుగానూ రూ.850గా నిర్ణయించారు. ఒక గ్లాస్ చెరకు రసం రూ.275గా ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన కొబ్బరి బోండాం ఒక్కోటి వెయ్యి రూపాయలని తెలుస్తోంది. ఈ ధరలు చూసిన నెటిజన్లు.. రానా- మిహికా పెట్టిన షాప్ కేవలం ధనవంతులకేనని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా! -
నాలుగో యానివర్సరీ.. రానా భార్య స్పెషల్ పోస్ట్
చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. రానా-మిహికాల పెళ్లి జరిగి అప్పుడే నాలుగేళ్లవుతోంది. వీరిద్దరూ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. నేడు నాలుగో యానివర్సరీ సందర్భంగా మిహిక సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపు పోస్ట్ షేర్ చేసింది.జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. సముద్రమంత మార్పులు వచ్చినా ఎల్లప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నీ మీద నాకున్న ప్రేమ.. మరెవరి మీదా ఇంత లేదు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి విదేశాల్లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోను జత చేసింది.ఇది చూసిన సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ యానివర్సరీ.. మీరెప్పటికీ ఇలాగే కలిసుండాలి.. జీవిత చరమాంకం వరకు ఇంతే సంతోషంగా ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
నా జీవితంలో మరపురాని రోజు అదే: మిహికా పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో స్టార్ దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ ఒకరు. 2020 ఆగస్టు 8న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లిన సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాండాలను.. నిజ జీవితంతో పోలుస్తూ ఫోటోలను పంచుకుంది. (ఇది చదవండి: మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్) మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా గురించి తెలిసిన వారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్ధం చేసుకుంటారు. అవి కేవలం జంతువులు మాత్రమే కాదు. అవి స్వచ్ఛమైన ఆనందం, క్యూట్‌నెస్, సరదాతనం, ఉల్లాసంతో నిండి ఉన్నాయి. మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నడాన్ని ఆనందిస్తామో?.. అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నా. అయితే నా జీవితంలో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతం మాత్రమే కాదు. నా జీవితంలో ఓ కల నిజమైనట్లే. అంతే కాకుండా నా జీవితంలో అత్యంత సంతోషకరమైన మరపురాని రోజు కూడా అదే అవుతుంది!' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)