నా జీవితంలో మరపురాని రోజు అదే: మిహికా పోస్ట్ వైరల్! | Sakshi
Sakshi News home page

Miheeka Bajaj: ఆ రోజు నిజమైన పాండాలా మారిపోతా.. మిహికా పోస్ట్ వైరల్!

Published Fri, Jan 5 2024 7:29 PM

Daggubati Rana Wife Miheeka Bajaj Shares Panda Post In Real Life - Sakshi

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్  కపుల్స్‌లో స్టార్ దగ్గుబాటి రానా, మిహిక బజాజ్  ఒకరు. 2020 ఆగస్టు 8న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లిన సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ తన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాండాలను.. నిజ జీవితంతో పోలుస్తూ ఫోటోలను పంచుకుంది. 

(ఇది చదవండి: మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్)

మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా గురించి తెలిసిన వారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్ధం చేసుకుంటారు. అవి కేవలం జంతువులు మాత్రమే కాదు. అవి స్వచ్ఛమైన ఆనందం, క్యూట్‌నెస్, సరదాతనం, ఉల్లాసంతో నిండి ఉన్నాయి. మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నడాన్ని ఆనందిస్తామో?.. అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నా. అయితే నా జీవితంలో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతం మాత్రమే కాదు. నా జీవితంలో ఓ కల నిజమైనట్లే. అంతే కాకుండా నా జీవితంలో అత్యంత సంతోషకరమైన మరపురాని రోజు కూడా అదే అవుతుంది!' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement