breaking news
	
		
	
  Mihika Bajaj
- 
      
                   
                                                       తండ్రి కాబోతున్న దగ్గుబాటి హీరో?టాలీవుడ్ హీరో రానా(Rana Daggubati ) తండ్రి కాబోతున్నారు. త్వరలోనే దగ్గుబాటి ఇంట్లోకి వారసుడు/ వారసురాలు రాబోతున్నారు. రానా సతీమణి మిహిక బజాజ్(Miheeka Bajaj) గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని రానా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఓ మంచి రోజు చూసి ఈ గుడ్ న్యూస్‌ని తన అభిమానులతో పంచుకోవాలని రానా భావిస్తున్నారట. గతంలోనూ మిషికా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఈ వార్తలను రానా దంపతులిద్దరూ కొట్టిపారేశారు. చాలా కాలం తర్వాత మరోసారి రానా తండ్రి కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ సారి కూడా పుకారుగానే మిగిలిపోతుందా? లేదా నిజంగానే రానాకి ప్రమోషన్ వచ్చిందా అనేది తెలియాలంటే వాళ్లు స్పందించేవరకు ఆగాల్సిందే. రానా, మిహికాలది ప్రేమ వివాహం. ముంబైలో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేసే మిహీకా స్వస్థలం హైదరాబాద్. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. కానీ లాక్డౌన్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడినట్లు ఓ ఇంటర్వ్యూలో రానా చెప్పారు. వీరిద్దరి పెళ్లి 2020 ఆగస్టు 8న జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. రానా వారసత్వంగా వస్తున్న వ్యాపారాలను చూసుకుంటూనే.. నిర్మాతగా, నటుడిగానూ కొనసాగుతున్నాడు.
- 
            
                                     
                                                                                                         న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)
- 
      
                   
                                                       నాలుగో యానివర్సరీ.. రానా భార్య స్పెషల్ పోస్ట్చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. రానా-మిహికాల పెళ్లి జరిగి అప్పుడే నాలుగేళ్లవుతోంది. వీరిద్దరూ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. నేడు నాలుగో యానివర్సరీ సందర్భంగా మిహిక సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపు పోస్ట్ షేర్ చేసింది.జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. సముద్రమంత మార్పులు వచ్చినా ఎల్లప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నీ మీద నాకున్న ప్రేమ.. మరెవరి మీదా ఇంత లేదు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి విదేశాల్లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోను జత చేసింది.ఇది చూసిన సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ యానివర్సరీ.. మీరెప్పటికీ ఇలాగే కలిసుండాలి.. జీవిత చరమాంకం వరకు ఇంతే సంతోషంగా ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 నా జీవితంలో మరపురాని రోజు అదే: మిహికా పోస్ట్ వైరల్!టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో స్టార్ దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ ఒకరు. 2020 ఆగస్టు 8న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లిన సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాండాలను.. నిజ జీవితంతో పోలుస్తూ ఫోటోలను పంచుకుంది. (ఇది చదవండి: మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్) మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా గురించి తెలిసిన వారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్ధం చేసుకుంటారు. అవి కేవలం జంతువులు మాత్రమే కాదు. అవి స్వచ్ఛమైన ఆనందం, క్యూట్‌నెస్, సరదాతనం, ఉల్లాసంతో నిండి ఉన్నాయి. మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నడాన్ని ఆనందిస్తామో?.. అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నా. అయితే నా జీవితంలో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతం మాత్రమే కాదు. నా జీవితంలో ఓ కల నిజమైనట్లే. అంతే కాకుండా నా జీవితంలో అత్యంత సంతోషకరమైన మరపురాని రోజు కూడా అదే అవుతుంది!' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ జంట టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరు. 2020 ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా ఓ నోట్ కూడా రాసుకొచ్చారు. పనితో పాటు జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటూ తన మెడపై బ్యాలెన్స్ అని టాటూ ఉన్న ఫోటోను పంచుకుంది. (ఇది చదవండి: మిహికా ఇన్‌స్టా పోస్ట్.. ప్రెగ్నెన్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్!) మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే సమతుల్యత. మన జీవితంలో బాధ్యతలు, అభిరుచుల మధ్య సామరస్యాన్ని కనుగొనడం. మీరు నైపుణ్య స్థాయిని అదుపులో ఉంచే శక్తిని మీరు కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు పని, సంబంధాలు, ఆటలతో జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. జీవితంలో ఉన్న లయను ఆనందించండి. మీరు వేసే ప్రతి అడుగు.. మీ ప్రత్యేకమైన ప్రయాణానికి మరింత ఆనందాన్ని ఇస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు సూపర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 షాపింగ్‌లో బిజీగా అను ఇమ్మాన్యుయేల్.. మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్!►షాపింగ్ ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్ ►ఒళ్లంతా డ్రెస్‌తో కప్పేసుకున్న శృతిహాసన్ ►రానా సతీమణి మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్ ►కలర్ ఫుల్ గౌనులో రష్మీ గౌతమ్ హోయలు ►ట్రెండింగ్ లుక్‌లో సింగర్ గీతామాధురి ►యోగాసనాలు చేస్తున్న శ్రియా శరణ్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)
- 
      
                   
                                 ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన మిహికాటాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ ఓ వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. రానా భార్య మిహికా బజాజ్ బీచ్ ఒడ్డున నడుస్తున్న వీడియో షేర్ చేయగా తను కాస్త బొద్దుగా తయారైందని, చూస్తుంటే గర్భవతిలా అనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. తాజాగా ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది మిహికా. 'నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. వైవాహిక జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తున్నాననంతే! అంతే తప్ప నేను గర్భవతిని కాదు. నిజంగా నేను గర్భం దాల్చినప్పుడు ఆ విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను' అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ తనకు యాక్ట్ చేయాలన్న ఆసక్తి లేదని పేర్కొంది. ఇకపోతే రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గతంలోనూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను దంపతులిద్దరూ కొట్టిపారేశారు. కాగా రానా, మిహికా 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మిహికా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. చదవండి: కొందరిని నమ్మి రూ.60 లక్షలు పోగొట్టుకున్నా: కమెడియన్
- 
      
                   
                                 మిహికా ఇన్‌స్టా పోస్ట్.. ప్రెగ్నెన్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్!రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ జంట టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరు. 2020 ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మిహికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఏమీ చేయకుండా ఉండటంలో కూడా ఓ స్వీట్నెస్ ఉంటుంది అంటూ క్యాప్షన్ జోడించింది. మిహికా ప్రెగ్నెంటా? ఈ వీడియోలో ఆమె బీచ్‌లో నడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిహికా గర్భవతిలా కనిపిస్తోంది, అందుకే వదులైన డ్రెస్ వేసుకుంది కాబోలు అంటూ ఏకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు మిహికాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వచ్చాయి. కానీ అవి వట్టి పుకారుగానే మిగిలిపోయాయి. గతంలో మిహికా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెన్సీ గాసిప్స్ గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. కొందరైతే ఏకంగా కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని.. తన మేనకోడలు అంటూ క్లారిటీ ఇచ్చింది మిహికా. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 'అదే నీతో ప్రేమలో పడేలా చేస్తుంది'.. రానా భార్య మిహికా క్యూట్ పోస్ట్ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు తమ వలెంటైన్స్తో కలిసి ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భర్త రానాతో కలిసి దిగిన ఓ క్యూట్ ఫోటోను షేర్చేస్తూ.. ''నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్, ఇంకా వండర్ఫుల్. నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవడం లేదు. అందుకే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు..(ఫన్నీ ఎమోజీ). రోజంతా నువ్వు నన్ను విసిగించినా నీ నవ్వు మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే రానా'' అంటూ తన భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. ఈ పోస్ట్ చూసి వెంకటేశ్ కూతురు ఆశ్రిత సహా పలువురు నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 మేకప్ లేకుండా లావణ్య త్రిపాఠిని చూశారా? అదే ఫేవరెట్ అంటున్న కత్రినా► మేకప్ లేకుండా లావణ్య త్రిపాఠిని చూశారా? ► లక్కీ లక్ష్మణ్‌తో వస్తున్న సోహైల్.. టికెట్స్ బుక్ చేసుకున్నారా? ► భర్తతో వెకేషన్ మూడ్‌లో ఉన్న కత్రినా కైఫ్ రాజస్థాన్ ఫేవరెట్ లొకేషన్ అంటూ పోస్ట్ ► త్రోబ్యాక్ ఫోటోను షేర్చేసిన మిహికా బజాజ్ ► పింక్ డ్రెస్‌లో రకుల్ స్టన్నింగ్ లుక్స్ View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)
- 
      
                   
                                 ఈ ఫోటోలో క్యూట్‌గా ఉన్న బాబు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ దంపతులు ఎప్పటికీ ప్రత్యేకమే. తెలుగు చిత్రసీమలో రానా ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటారు. బాహుబలి సినిమాతో రానా ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇవాళ ఈ బాహుబలి స్టార్ బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రీటిలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి మిహికా బజాజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. రానా చిన్నప్పటి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ భర్తకు బర్త్ డే విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అత్యంత అందమైన మనిషిగా మారిన అందమైన బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు! చూడు ఎంత అందంగా ఉన్నాడో! మీరు నా జీవితంలోకి తీసుకువచ్చిన ఆనందానికి ధన్యవాదాలు! నాకు భర్తతో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా బేబీ.. నీ పట్ల నా ప్రేమకు హద్దులు లేవు. ఇప్పుడు నువ్వు నా ప్రేమ జీవితంలో ఇరుక్కుపోయావు. రాబోయే కొత్త ఏడాదిలో మీ కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నా.' అంటూ భర్తకు ఎమోషనల్ విషెష్ చెప్పారు. (ఇది చదవండి: భార్య ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన రానా.. ఏమన్నారంటే?) ఆగస్ట్ 8, 2020 లాక్డౌన్ సమయంలో రానా దగ్గుబాటి, మిహీకా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సమంత రూత్ ప్రభు, రామ్ చరణ్, నాగ చైతన్య, సన్నిహితులు హాజరయ్యారు. రానా దగ్గుబాటి సోదరితో మిహీకా స్కూల్‌కి వెళ్లడంతో ఈ ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడులో కనిపించనున్నారు. ప్రముఖ అమెరికన్ క్రైమ్ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో వెంకటేష్ దగ్గుబాటితో కలిసి నటిస్తున్నారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మల దర్శకత్వంలో జెస్సికా హారిసన్, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 జాన్వీ గ్లామర్ ముందు.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరి► రెడ్ చీరలో కాజోల్ స్టన్నింగ్ లుక్స్ ► హై హీల్స్‌తో షమితా శెట్టి అందాలు ► రానా చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసిన మిహికా ► తల్లికి బర్త్‌డే విషెస్ చెప్పిన విష్ణు.. ► ఇనయాని కలిసిన వాసంతీ.. రౌడీ బేబీ అంటూ ట్యాగ్ లైన్ ► మీనాక్షి చౌదరి అందాల విందు ► జాన్వీ కపూర్ గ్లామరస్ స్టిల్స్ View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shamita Shetty (@shamitashetty_official) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Bhumi 🌏 (@bhumipednekar) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Dhvani Bhanushali (@dhvanibhanushali22)
- 
      
                   
                                 మీ ప్రేమకు కృతజ్ఞతలు .. మిహికా ఎమోషనల్ పోస్ట్..!ఇటీవల దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే రానా భార్య మిహికా మేనకోడలును ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో అభిమానులు మిహికా ప్రెగ్నెంట్ అని భావించారు. కొందరైతే ఏకంగా సోషల్ మీడియాలో అభినందనలు కూడా తెలిపారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రూమర్లపై రానా క్లారిటీ ఇవ్వడంతో వాటికి తెరపడింది. రానా భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా భర్త రానాతో ఉన్న ఓ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. రానాను ప్రశంసిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మిహికా. మిహికాను రానా తన చేతుల్లో పట్టుకుని సంతోషంగా చిరునవ్వుతో ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది. మిహికా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రాస్తూ.. 'నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన మీకు అభినందనలు. మీ దారిలో నడుస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆ విషయాల్లో తప్పకుండా మీరు కూడా ఒకరుగా ఉంటారు.' అంటూ రానాను ప్రశంసలతో ముంచెత్తింది. పోస్ట్ చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 భార్య ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన రానా.. ఏమన్నారంటే?టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికీ బజాజ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మిహికా షేర్చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రాకముందే మిహికా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో వైరలయ్యాయి. ఇటీవలే ఆమె ఓ పాపను ఎత్తుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో పలువురు అభినందనలు కూడా తెలిపారు. అయితే తాజాగా నటుడు దగ్గుబాటి రానా తాజాగా స్పందించారు. (చదవండి: మిహికా ఇన్‌స్టా పోస్ట్ వైరల్ .. రానా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!) గాయని కనికా కపూర్ సైతం ఈ జంటకు అభినందనలు తెలపడంంతో తాజాగా రానా క్లారిటీ ఇచ్చారు. తాను తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని అన్నారు. తన భార్య మిహీకా గర్భవతి కాదని స్పష్టం చేశారు. దీంతో నెట్టింట్లో హల్చల్ రూమర్లకు ముగింపు పలికారు. టాలీవుడ్‌లోని ఆరాధ్య జంటలలో ఒకరైన రానా, మిహీకా ఆగస్టు 8, 2020న వివాహం చేసుకున్నారు. పెళ్లయాక రానా, మిహీక సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తున్నారు. రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
- 
      
                   
                                 మిహికా ఇన్‌స్టా పోస్ట్ వైరల్ .. రానా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికీ బజాజ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మిహికా షేర్చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రాకముందే మిహికా ప్రెగ్నెంట్ అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఇదివరకే ఈ విషయంపై మిహికా క్లారిటీ ఇస్తూ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లో ఉన్నాను.. అందుకే కాస్త హెల్దీగా మారాను అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'నా ఏంజెల్‌తో మొదటి ఫోటో..ప్రేమతో మిహికా బజాజ్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు.. పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు రానా, మిహికాలకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఒకడుగు ముందుకేసి సరోగసా అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని, తన మేనకోడలు అంటూ మిహికా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka)
- 
      
                   
                                 రానా తండ్రి కాబోతున్నాడా? క్లారిటీ ఇచ్చేసిన మిహికాటాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట ఒకటి. 2020 ఆగస్టు8న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు రానా భార్య ప్రెగ్నెంట్ అంటూ టాక్ వినిపిస్తుంది. మిహికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే రీసెంట్గా మిహికా షేర్చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. దీంతో ఓ ఫ్యాన్ మిహికా పోస్టుపై స్పందిస్తూ.. మీరు ప్రెగ్నెంటా అని అడగ్గా.. నేను హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లో ఉన్నాను. అందుకే ఈ మధ్య కాస్త హెల్దీగా మారాను అంటూ మిహికా రిప్లై ఇచ్చింది. దీంతో మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లయ్యింది.
- 
      
                   
                                 పెళ్లిరోజే పోస్టులు డిలీట్.. రానా భార్య ఏం చేసిందంటే..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. అలాంటి రానా ఉన్నట్లుండి ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేయడం, అది కూడా పెళ్లిరోజే పోస్టులు తొలగించడం పలు అనుమానాలకు తావిచ్చింది. పెళ్లిరోజుకు ఒకరోజు ముందే సోషల్ మీడియా బ్రేక్ కూడా ప్రకటించడంతో రానా పర్సనల్ లైఫ్‌పై నెట్టింట చర్చ మొదలైంది. భార్య మిహికాకు-రానాకు మధ్య ఏమైనా విబేధాలు తలెత్తాయన్న రూమర్స్ కూడా గుప్పుమన్నాయి. చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. అయితే తాజాగా రానా భార్య మిహికా ఈ వార్తలకు చెక్ పెట్టింది. సెకండ్ ఆనివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రానా-మిహికాలకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక మిహికా పోస్ట్ చూసి వెంకటేశ్ కూతురు ఆశ్రితతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కపుల్స్‌కి ఆనివర్సరీ విషెస్‌ను తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘పని జరుగుతోంది. సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ రానా ట్వీట్ చేసి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bunty Bajaj (@buntybajaj)
- 
      
                   
                                 రానా భార్య ఫోటోకి కామెంట్ చేసిన సమంత..టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రెండ్ వెడ్డింగ్‌లో రానా- మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లతో పాటు సమంత కూడా రియాక్ట్ అయ్యింది. చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న రానా భార్య? పోస్టుతో క్లారిటీ 'నీ అవుట్‌ఫిట్ నాకు నచ్చింది' అంటూ మిహికా పోస్టుకు సమంత కామెంట్ చేయగా థ్యాంక్యూ.. అంటూ ఆమె మిహికా ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా నాగచైతన్యతో విడిపోయినప్పటికీ సమంత ఆ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉండటం విశేషం. వెంకటేశ్ కూతురు ఆశ్రిత, మిహికాలతో పాటు పలువురితో సమంతకు ఇప్పటికీ మంచి ఫ్రెండిప్ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ నాగ చైతన్య మినహా నాగార్జున, అఖిల్ సహా అక్కినేని కుటుంబసభ్యులను సమంత ఇప్పటికీ ఫాలో అవుతుంది. చదవండి: సమంతకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్
- 
      
                   
                                 త్వరలోనే తల్లి కాబోతున్న రానా భార్య? పోస్టుతో క్లారిటీటాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట ఒకటి. 2020 ఆగస్టు8న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రానా భార్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. రీసెంట్గా ఓ ఫ్రెండ్ వెడ్డింగ్‌లో రానా-మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో మిహికా కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో మీరు ప్రెగ్నెంటా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. వీటిపై మిహికా ఆన్సర్ ఇచ్చింది. నాకు క్యూరియాసిటీగా ఉంది..అందుకే అడుగుతున్నా. మీరు ప్రెగ్నెంటా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. నోనో మ్యారేజ్ వెయిట్ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రానా త్వరలోనే విరాటపర్వంతో పాటు ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు పలకరించనున్నారు.
- 
      
                   
                                 రానా-మిహీకాల అన్‌సీన్ పెళ్లి వీడియో చూశారా?Rana Daggubati And Miheeka Bajaj Unseen Marriage Video Goes Viral: హీరో రానా దగ్గుబాటి గతేడాది ఆగస్టు8న మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.కరోనా నేపథ్యంలో రామనాయుడు స్టూడియోలోనే కుటుంబీకుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కోవిడ్ నిబంధనల కారణంగా కేవలం సుమారు 30మంది బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. గతేడాది ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అతిథులు ఎవ్వరిని పెళ్లి వేడకకు ఆహ్వానించలేదు. అయితే తాజాగా పెళ్లితంతుకు సంబంధించిన వీడియోను రానా భార్య మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. మిహీకా వీడియోకు వెంకటేవ్ కూతురు ఆశ్రిత, మంచు లక్ష్మీ సహా మరికొందరు ప్రముఖులు కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by miheeka (@miheeka)
- 
      
                   
                                 బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకుని రావాలంటున్న రానా భార్యMiheeka Bajaj Supports Tamil Bigg Boss Contestant Akshara Reddy: బిగ్‌బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర అభిమానులను ఎంతగానో అలరించే ఈ షో ప్రతియేటా కొత్త కంటెస్టెంట్లతో, కొంగొత్త గేమ్స్‌తో సరికొత్తగా ముస్తాబవుతూ మన ముందుకు వస్తుంటుంది. ప్రస్తుతం తెలుగులో కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ ఐదో సీజన్ విజయవంతంగా ప్రసారమవుతోంది. అటు తమిళంలోనూ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా ఐదో సీజన్ రన్ అవుతోంది. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. ఈమె ఒక మోడల్, మిస్ గ్లోబ్ 2019 అవార్డు గ్రహీత కూడా! గతంలో 'విల్లా టు విలేజ్' అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. అలాగే 'కసు మెలా కసు' అనే మలేషియన్ మూవీలోనూ తొలిసారి నటించింది. తాజాగా ఈ అక్షరకు సపోర్ట్‌గా నిలబడిందో టాలీవుడ్ హీరో భార్య. భళ్లాలదేవ రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ అక్షరకు సపోర్ట్ చేయండంటూ వీడియో రిలీజ్ చేసింది. 'బిగ్‌బాస్ తమిళ ఐదో సీజన్లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు. పాల్గొన్న నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్ ద బెస్ట్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by miheeka (@miheeka)
- 
      
                   
                                 రానా అడిగాడు, ఓకే చెప్పాను: మిహికా బజాజ్నిన్నటికి సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి.. ప్యార్ మే పడిపోయానే.. అంటూ భళ్లాల దేవ రానా దగ్గుబాటి ప్రేమ పాటలు పాడుకున్నాడు. అంతేనా.. ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా అన్నట్లుగా మిహికా బజాజ్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తను నాకు ఎస్ చెప్పింది అంటూ ఎగిరి గంతేశాడు. ఈ ఒక్క పోస్ట్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ఉన్న రానా సడన్‌గా సైడ్ అయిపోయినట్లు అందరికీ అర్థమైపోయింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు రానాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రేమకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆగస్టు 8న వేదమంత్రాల సాక్షిగా మెచ్చిన నెచ్చెలితో ఏడడుగులు నడిచి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు రానా. View this post on Instagram A post shared by miheeka (@miheeka) అయితే తన దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి నిన్నటికి(మే 12) సరిగ్గా ఏడాది అవుతుండటంతో రానా గతంలో షేర్ చేసిన పోస్టును మరోసారి అభిమానులతో పంచుకుంది మిహికా బజాజ్. "రానా తన మనసులో మాట అడిగాడు. నేను సరేనంటూ తలాడిస్తూ నా అంగీకారం తెలిపాను. నా జీవితంలో తీసుకున్న అత్యుత్తుమ నిర్ణయం ఇదే కాబోలు. ఇది జరిగి సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా అడిగినందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ రానా.." అని రాసుకొచ్చింది. కాగా రానా ప్రస్తుతం విరాటపర్వం, హాతి మేరే సాతి, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. @RanaDaggubati #Congratulations 😍#RanaDaggubati #Rana #MiheekaBajaj #mihee #Trending #Telugu #Tollywood #tollywoodactress #Kollywood #Bollywood #bhalaldev#Bahubali2 #BahubaliStar #bahubali @ssrajamouli #kattappa@TV9Telugu @telugufilmnagar And single* me :- 😂♥️ pic.twitter.com/st0eBVJtEw — @game_of_memes1 (@Memes1Of) May 12, 2020 చదవండి: వచ్చే ఏడాదే రకుల్ ప్రీత్ పెళ్లి : మంచు లక్ష్మీ
- 
      
                   
                                 రానాకు లవ్లీ విషెస్ తెలిపిన మిహికాయంగ్ హీరో రానా దగ్గుబాటి సినీ పరిశ్రమలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తవుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా..తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2010, ఫిబ్రవరి 19న విడుదలైన లీడర్ సినిమా వచ్చి నేటికి సరిగ్గా 11 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా రానా భార్య మిహిక ఇన్స్టాగ్రామ్ ద్వారా భర్త రానాకు విషెస్ తెలిపింది. లీడర్ పోస్ట్‌ర్‌ను షేర్చేస్తూ.. 'హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా` అంటూ లవ్లీ విషెస్ తెలిపింది. ఇక ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో రానా వివాహం విహికా బజాజ్‌తో జరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా రానాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా 11ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రానాకు స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఏప్రిల్ 30న వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లో పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్నారు. చదవండి : (పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ హీరో) (సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్ధం!) Rana completes 11 years as an actor! Here's to all his unforgettable characters, super hit movies, undeniable energy and passion for what he does ♥️@RanaDaggubati #11GloriousYrsOfRANADAGGUBATI pic.twitter.com/WQIEkWb4uX — Suresh Productions (@SureshProdns) February 18, 2021
- 
      
                   
                                 ‘రానా – మిహికా.. ఆగస్ట్ 8, 2020’చేతిలోన చెయ్యేసి ఓ మధుర జ్ఞాపకాన్ని సృష్టించుకున్నారు టాలీవుడ్ కొత్త జంట రానా దగ్గుబాటి, మిహికా బజాజ్. ఈ కొత్త జంట చేతిలో చెయ్యేసుకొని, దాన్ని 3డీ మోడల్లో ఓ గుర్తుగా మలుచుకున్నారు. ప్రముఖ ఆర్టిస్ట్ భావనా జస్ర దగ్గర ఈ త్రీడీ మోడల్‌ను చేయించుకున్నారు. ముందుగా వీరి చేతులను త్రీడీ ఉపయోగించి, బంక మట్టితో కొలతలు తీసుకున్నారు. ఒకరి చేయిని మరొకరు పట్టుకున్న మౌల్డ్‌ను తయారుచేసి, దానికి బంగారు పూత పూస్తారు. ‘రానా – మిహికా. ఆగస్ట్ 8, 2020’ అంటూ వాళ్ల పెళ్లి తేదీకి గుర్తుగా ఈ త్రీడీ మోడల్ చేయించారు.
- 
      
                   
                                 పిజ్జాలతో వేడుక‘నా పెళ్లాం పుట్టిన రోజు. అంటే నాకు సెలవులు’ అంటున్నారు రానా. రానా భార్య మిహికా బజాజ్ పుట్టిన రోజు శనివారం. ఈ సందర్భంగా ఆమెకు నచ్చిన పిజ్జాలను ఆర్డర్ చేసి, అర్ధరాత్రి బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు రానా. పుట్టినరోజున మిహికా అడిగితేనే వర్క్‌నుంచి రానా బ్రేక్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మిహికా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ ఇద్దరూ కలసి శనివారం చిన్న హాలిడేకి వెళ్లారు.
- 
      
                   
                                 మిహికా బర్త్ డే.. రానా వెరైటీ గిఫ్ట్పైళ్లైన తొలి ఏడాదిలో వచ్చే ప్రతి పండుగ భార్యభర్తలకు ఎంతో స్పేషల్. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు మరింత ప్రత్యేకం. వివాహం అయ్యాక వచ్చే జీవిత భాగస్వామి మొదటి పుట్టిన రోజుకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తారు. హీరో రానా దగ్గుబాటి కూడా ఇలానే ఆలోచించారు. భార్య మిహికా బజాజ్ పుట్టిన రోజు సందర్భంగా రానా వెరైటీ ట్రీట్ ఇచ్చారు. సాధారణంగా బర్త్‌డే అంటే ఎవరైనా కేక్ కట్ చేయిస్తారు. కానీ రానా మాత్రం భార్య కోసం అర్థరాత్రి పిజ్జా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రానా. పెళ్లామ్స్ బర్త్‌డే.. మనకు హాలీడే అనే ఫన్నీ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రానా.. తనెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. (చదవండి: కిడ్నీలు ఫెయిల్ అవుతాయన్నారు ) ఇక మిహికా కూడా ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. రానాది ఫోర్స్డ్ హాలీ డే అని..తన బలవంతం మేరకు అతడు సెలవు తీసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు తెగ వైరలువున్నాయి. క్యూట్ కపుల్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆగస్టులో మిహికా బజాజ్‌తో రానా పెళ్లి నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘హాథీ మేరీ సాతీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇది తెలుగులో అరణ్యగా విడుదల కాబోతుంది. ఇక దీనితో పాటు విరాట పర్వం షూటింగ్ కొనసాగుతుంది. ఈ చిత్రంలో రానా కామ్రెడ్ రవన్నగా అలరించనున్నారు.
- 
      
                   
                                 కిడ్నీలు ఫెయిల్ అవుతాయన్నారు‘బాహుబలి’ సినిమాలోని భల్లాలదేవా పాత్రకు సరైన కటౌట్ రానానే. బాహుబలి ప్రభాస్ కటౌట్‌కి సరైన కటౌట్ రానానే అనిపించుకున్నారు. అలా ధైర్యసాహసాలు ఉన్న శక్తిమంతుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రానా ఆ మధ్య అనారోగ్యం పాలయ్యారనే వార్తలు రావడం తెలిసిందే. ఇప్పటివరకూ తన ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడని రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. ‘‘నా జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్ (వేగంగా)లో వెళుతున్న సమయంలో చిన్న పాజ్ (కుదుపు/చిన్న గ్యాప్) వచ్చింది. నా ఆరోగ్య సమస్య ఏంటంటే పుట్టినప్పటి నుండే నాకు బీపీ (బ్లడ్‌ప్రెజర్) ఉంది. దాంతో గుండె చుట్టూ ఉండే పొర పెళుసుబారిపోతుందని, తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయని డాక్టర్లు అన్నారు. ఈ సమస్య ఉండటం వల్ల 70 శాతం స్ట్రోక్ రావచ్చని, 30 శాతం వరకు ప్రాణహాని ఉందని కూడా చెప్పారు’’ అంటూ ఎమోషన్‌కి గురయ్యారు రానా. ఇదిలా ఉంటే లాక్డౌన్లో రానా పెళ్లి మిహికాతో జరిగిన విషయం తెలిసిందే. రానా ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌తో సూపర్‌గా బిజీగా ఉంటున్నారు రానా.
- 
      
                   
                                 క్షేమం కోరి...బాలీవుడ్లో అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందడంతా ‘కర్వా చౌత్’ కోసమే. భర్త శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉండి, భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక భార్య ఉపవాసాన్ని విరమించే పండగ ఇది. ప్రతి ఏడాదీ ఈ పండగను ఘనంగా జరుపుకునేవారిలో శిల్పా శెట్టి ముందుంటారు. ఈసారి కూడా మిస్ కాలేదు. కష్టకాలంలో (కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలవడం) తోడున్న భర్త కోసం సోనాలీ బింద్రే ఉపవాసం ఆచరించారు. విదేశీ గాయకుడు నిక్ జోనస్‌ని పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ‘లవ్ యు నిక్’ అంటూ లాస్ ఏంజిల్స్‌లో పండగ చేసుకున్నారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు తదితరులు కూడా శ్రద్ధగా పూజలు చేశారు. కొత్త దంపతులు కాజల్ అగర్వాల్–గౌతమ్, వీరికన్నా ముందు ఆగస్ట్ 8న పెళ్లి చేసుకున్న రానా–మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. డిజైనర్ శారీ, చక్కని నగలతో తమ భర్తతో కలిసి దిగిన ఫొటోలను అందాల భామలు షేర్ చేశారు. రానా, మిహీకా; ∙నక్తో ప్రియాంకా చోప్రా; రవీనా టాండన్; భర్తతో సోనాలీ బింద్రే; భర్తతో బిపాసా
- 
      
                   
                                 రానా- మిహికల కర్వాచౌత్ ..రానా దగ్గుబాటి- మిహిక బజాబ్‌ల జట్ట పెళ్లైన తొలి ఏడాది వస్తున్న అన్ని పండగలను చాలా సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు. దసరా పండుగ రోజు తర్వాత తాజాగా కర్వా చౌత్‌ను కూడా ఈ జంట చాలా ఆనందంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను మిహిక తల్లి బంటి బజాబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎరుపు రంగు చీర ధరించి, సంప్రదాయమైన నగలను మిహిక ధరించింది. నుదుట కుంకుమ, బంగారు రంగు చెవి దిద్దులు, ముక్కు పుడక పెట్టుకొని తెలుగమ్మాయిలా కనిపించింది. ఇక రానా లుక్ విషయానికి వస్తే ఎప్పటిలాగే సింపుల్‌గా కనిపించాడు. బ్లాక్ కలర్ టీ షర్ట్ జీన్స్ వేసుకున్నాడు. ఈ ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను కూడా బంటి బజాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. హ్యాపీ కర్వా చౌత్, గాడ్ బ్లెస్ యూ అంటూ ఆమె ఈ ఫోటోలను పోస్ట్ చేశారు.
- 
      
                   
                                 రానా, మిహికల మొదటి దసరా వేడుకలురానా దగ్గుబాటి, మిహిక బజాబ్ దసరాను ఘనంగా జరుపుకున్నారు. పెళ్లైన తరువాత ఇదే వారి తొలి దసరా కావడంతో కుటుంబంతో కలిసి వేడుకలను చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిహిక బజాబ్ తల్లి బంటి బజాజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో వైలెట్ కలర్ అండ్ హాఫ్ వైట్ డ్రస్ ధరించి మిహికా సంప్రదాయబద్ధంగా కనిపించింది. దానికి తగ్గట్టు ఉండే జ్యూవెలరీని ధరించింది. ఇక ఎప్పటిలాగే రానా తన స్టైలిష్ లుక్‌లో వైట్ డ్రస్‌లో దర్శనమిచ్చాడు. మిహికా, రానా, మిహిక తల్లిదండ్రులు కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఆగస్టులో మిహిక బజాజ్‌తో రానా పెళ్లి నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘హాథీ మేరీ సాతీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇది తెలుగులో అరణ్యగా విడుదల కాబోతుంది. View this post on Instagram Happy Dussehra @ranadaggubati @miheeka A post shared by Bunty Bajaj (@buntybajaj) on Oct 25, 2020 at 5:33pm PDT చదవండి: సంక్రాంతి బరిలో అరణ్య
- 
      
                   
                                 హనీమూన్‌లో కొత్త జంటపెళ్లయిన రెండు నెలలకు రానా–మిహికా హనీమూన్ వెళ్లారు. ఆగస్ట్ 8న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, తక్కువమంది సమక్షంలో పెళ్లి వేడుక జరిగింది. కోవిడ్ కారణంగానే వెంటనే హనీమూన్ ప్లాన్ చేసుకోలేకపోయారు ఈ నూతన దంపతులు. ఇప్పుడు లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఏర్పడిన నేపథ్యంలో హనీమూన్ చెక్కేసింది ఈ జంట. విదేశాల్లో బీచ్ డేని ఎంజాయ్ చేస్తూ, సెల్ఫీ దిగారు రానా–మిహికా. ఆ ఫొటోను షేర్ చేశారు. ఈ హాలీడే ట్రిప్ తర్వాత వచ్చే నెలలో ‘విరాటపర్వం’ షూటింగ్లో పాల్గొంటారు రానా.
- 
      
                   
                                 రానా హనీమూన్, భార్యతో సెల్ఫీహీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌కు మూడు ముళ్లు వేసి వివాహ బంధంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. గత నెల 8న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో తక్కువ మంది సమక్షంలోనే గ్రాండ్‌గా జరిగింది. ఆ సమయంలో రానా- మిహికా జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఈ దంపతులు హనీమూన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు మిహికా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోయే నిదర్శనం. భర్త కోసమే ఇలా.. అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఇందులో మిహికా సాగర తీరాన భర్తతో కలిసి ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నారు. (చదవండి: పెళ్లి పందిట్లో చైతూ, సమంత చిలిపి పని) ఈ క్రమంలో ఇసుకలో పడుకుని కబుర్లు చెప్తున్న సమయంలో భార్యను సెల్ఫీలో బంధించారు రానా. కాగా మిహికా పెళ్లి తర్వాత శ్రీవారితో కలిసి దిగిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం. ఇంతకీ ఈ హనీమూన్ ఎక్కడ అనే విషయం మాత్రం సస్పెన్స్‌గా ఉంది. అయితే గతంలో హనీమూన్ ట్రిప్ గురించి రానా మాట్లాడుతూ.. ఆమ్స్టర్డ్యామ్లో హనీమూన్ ప్లాన్ చేశామని తెలిపారు. తనకు ఆర్ట్ అంటే ఇష్టమని, ఆమ్స్టర్డ్యామ్ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది, కాబట్టి అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు. తన భార్య కూడా ఆ ప్రదేశానికి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కరోనా ప్రభావం తగ్గాక అక్కడికి షికారుకు వెళ్తామని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఈ కొత్త జంట ఆమ్స్టర్డ్యామ్కే వెళ్లినట్లు తెలుస్తోంది. (చదవండి: సర్వస్వం నువ్వే.. లవ్ యూ: మిహికా)
- 
      
                   
                                 హనీమూన్ అక్కడే!హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో దగ్గుబాటి, మిహికా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుక ముగించారు. రానా–మిహిక పెళ్లి వీడియో, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి కూడా. కోవిడ్ కారణంగా ఈ కొత్త జంట హనీమూన్‌ని కొన్నాళ్లు వాయిదా వేసుకుంది. ‘‘మా హనీమూన్ కోసం ఆమ్‌స్టర్‌డ్యామ్‌ని సెలక్ట్ చేసుకున్నాం. నాకు ఆర్ట్ అంటే ఇష్టం. ఆమ్స్టర్డ్యామ్ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నా. మిహికా కూడా ఆ ప్లేస్‌కి ఓకే చెప్పిది. కరోనా వైరస్ ప్రభావం లేకపోతే ఇప్పుడే వెళ్లేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మా హనీమూన్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు రానా.
- 
      
                   
                                 సర్వస్వం నువ్వే.. లవ్ యూ: మిహికా‘‘నా ప్రేమ, నా జీవితం, నా హృదయం, నా ఆత్మ! నా సర్వస్వం నువ్వే. నేనెప్పుడూ కలలో కూడా ఇది ఊహించలేదు!! నన్ను మరింత మెరుగైన వ్యక్తిగా మలిచావు. ఐ లవ్ యూ!’’ అంటూ మిహికా బజాజ్ తన భర్త రానా దగ్గుబాటిపై ప్రేమను చాటుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు భావోద్వేగ క్యాప్షన్ జతచేశారు. కాగా ప్రేమజంట రానా- మిహికాల పెళ్లి గత శనివారం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవోపేతంగా ఈ శుభకార్యాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నవ వధువు మిహికా తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు. (కుటుంబంలోకి స్వాగతం మిహికా: సమంత) భర్త రానా, సోదరుడు సమర్థ్ బజాజ్‌తో పాటు తల్లిదండ్రులతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఉన్న కొన్ని మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో మరోసారి రానా- మిహికాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రామానాయుడు స్టూడియోలో వివాహం జరిగిన అనంతరం నవ దంపతులు వ్రతం ఆచరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో సెలబ్రిటీ కపుల్, రానా కజిన్ నాగచైతన్య- సమంత దంపతులు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్తజంటతో పాటు వారికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ చై-సామ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.(రానా పెళ్లిలో చైతూ చిలిపి పని) డాడీస్ గర్ల్ మిహికా
- 
      
                   
                                 రానా పెళ్లిసందడిశనివారం రానా ఒక ఇంటివాడయ్యాడు. మిహికా బజాజ్‌కి మూడుముళ్లు వేసి, ఆమెతో కలిసి ఏడడుగులు నడిచారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన గోల్డ్ మరియు క్రీమ్ కలర్ లెహంగాను ధరించారు మిహికా. ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి సుమారు పదివేల గంటలు పట్టిందట. కేవలం చేతిపని కావడంతో ఇన్ని గంటలు పట్టిందని సమాచారం. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరుకుటుంబాలకు బాగా దగ్గరైన ప్రముఖులు హాజరయ్యారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానా, మిహికా, రామ్‌చరణ్, ఉపాసన దగ్గుపాటి సురేష్, రానా, వెంకటేశ్ కుటుంబ సభ్యులతో రానా, మిహికా
- 
            
                                     
                                                             రానా, మిహికా పెళ్లి సందడి షురూ ...
- 
  
      ఘనంగా జరిగిన రానా- మిహికాల హాల్దీ ఫంక్షన్
- 
      
                   
                                 మెరిసే.. మురిసే...హీరో రానా దగ్గుబాటి – మిహికా బజాజ్ పెళ్లి ఈ నెల 8న జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరి ఇంట్లో పెళ్లికి సంబంధించిన వేడుకలు ఆరంభమయ్యాయి. గురువారం మిహికా ఇంట్లో ‘హల్దీ ఫంక్షన్’ నిర్వహించారు. పసుపు రంగు డిజైనర్ లెహంగా, సముద్రపు గవ్వల జ్యువెలరీలో మిహికా మెరిశారు. కాబోయే భర్త రానాతో కలిసి ఫొటో దిగి, మురిసిపోయారు. కాగా కరోనా నేపథ్యంలో రానా – మిహికా పెళ్లిని సింపుల్‌గా జరపనున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యమైన అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. వివాహానికి హాజరయ్యే వారు తప్పని సరిగా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవాలని ఇరు కుటుంబ సభ్యులు పేర్కొన్నారట. పెళ్లి వేదిక, పరిసర ప్రాంతాల్ని శానిటైజ్ చేయించడంతో పాటు అందరూ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. పెళ్లికి తయారు చేయించే వంటకాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. వంటలు చేసేవాళ్లకు కోవిడ్ టెస్ట్ చేయించారని సమాచారం.
- 
      
                   
                                 హల్దీ వేడుక : మెరిసిపోతున్న మిహికాసాక్షి, హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి వేడుక సందడి మొదలైంది.పెళ్లి పనుల హడావిడి ఇరు కుటుంబాల్లోనూ ప్రారంభమైంది. పెళ్లికూతురు మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు. ప్రత్యేక సీషెల్స్ డిజైనర్ ఆభరణాలతో ఆకట్టుకుంటున్నారు. (రానా-మిహికా వివాహం; వీరికి మాత్రమే ఆహ్వానం) కాగా రామానాయుడు స్టూడియోలో ఆగస్టు 8న రానా తన ప్రేమికురాలు మిహికా మెడలో మూడుముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. రానా, మిహికా కుటుంబాల నుండి కొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు, చెఫ్‌లు, సర్వర్లను కూడా పరీక్షిస్తున్నామని, కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్‌లో ఉన్నట్టు నిర్మాత సురేష్ వెల్లడించారు. View this post on Instagram Loving @ranadaggubati and @miheeka Bajaj's minimalistic looks for their haldi in Hyderabad today! Watch this space for more updates! Make-up Artist: @makeupartisttamanna 📸: @reelsandframes #ranadaggubati #miheekabajaj #celebrityweddings #celebritynews #lockdownwedding #bollywoodnews #celebrityweddings #breakingnews #intimateceremony #intimateweddings #weddingsutrab#haldiceremony A post shared by WeddingSutra.com (@weddingsutra) on Aug 6, 2020 at 1:37am PDT
- 
      
                   
                                 రానా-మిహికా పెళ్లి; వీరికి మాత్రమే ఆహ్వానంసాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో, దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌తో ఈ నెల 8న ఏడడుగులు వేయనున్నారు. పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులన్నీ చకాచకా జరుతున్నాయి. ఇక ‘మేం ప్రేమలో ఉన్నాం’ అని రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేయడం తెలిసిందే. అయితే పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుందని, వివాహానికి ఎంతో మంది అతిథులు వస్తున్నారనే వార్తలు ఇటీవల వినిపించడంతో ఈ వదంతులపై రానా తండ్రి సురేష్ బాబు స్పందించారు. రోకా ఫంక్షన్ నిర్వహించిన రామానాయుడు స్టూడియోలోనే వివాహ వేడుక జరగనుందని ఆయన స్పష్టం చేశారు. (రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!) సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరవుతారు. ఇరు కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరూ ఉండరు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటం వల్ల ఈ పెళ్లి వేడుకలో ఎవరి ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేయాలని మేం అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలో, బయట ఉన్న మా అత్యంత సన్నిహితులను కూడా ఆహ్వానించడం లేదు. పెళ్లి చాలా సింపుల్‌గా జరుగుతుంది. కానీ, అంతే అందంగా కూడా ఉంటుంది’ అని సురేష్ బాబు చెప్పారు. (మిహికా.. ముందు షాక్ అయ్యింది: రానా) కాగా పెళ్లి వేడుక మొత్తాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని దగ్గుబాటి కుటుంబం ఆలోచిస్తుంది. కరోనా నేపథ్యంలో పెళ్లిలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారు. వివాహ వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నాం. భౌతిక దూరాన్ని పాటిస్తాం. ఇది ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక కాబట్టి దీన్ని అత్యంత భద్రత కలిగిన పండుగగా మారుస్తాం’ అని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా పార్టీని నిర్వహిస్తామని సురేష్ బాబు వెల్లడించారు. (రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ) View this post on Instagram And it’s official!! 💥💥💥💥 A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 20, 2020 at 11:00pm PDT View this post on Instagram To the beginning of forever 💕 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 20, 2020 at 11:28pm PDT
- 
      
                   
                                 మిహికా.. ముందు షాక్ అయ్యింది: రానాటాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. రానా-మిహికాల వివాహం ఆగస్టు 8న జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పత్రిక తెగ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో రానా ఓ ఆంగ్లమీడియా ఇంటర్వ్యూలో తనకు కాబోయే శ్రీమతి మిహికా బజాజ్ గురించి, వారి బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘మిహికా, మేం ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. మా ఇంటి నుంచి తన ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే. వివాహం చేసుకోవడానికి నేను చాలా వింతైన సమయాన్ని ఎన్నుకున్నాను’ అన్నారు. ‘పెద్దవాడిని అయ్యాను పెళ్లి చేసుకోవాడానికి ఇదే మంచి సమయం అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో కొన్ని సార్లు అన్ని సజావుగా సాగిపోతుంటాయి. అప్పుడు వాటి గురించి ఎలాంటి ప్రశ్నలు అడగను. తను చాలా మంచిది. మేం చాలా గొప్ప జంటగా నిలుస్తాం. ఒకరినుంచి ఒకరం సానుకూల అంశాలను స్వీకరిస్తాం. ఆగస్టు 8న నేను వివాహం చేసుకోబోతున్నాను. మిహికాతో వివాహం జరగడం అనేది నా వ్యక్తిగత జీవితంలో అత్యంత ఉత్తమమైన సమయం. ఈ ఆలోచన ఎంతో అద్భుతంగా ఉంది’ అన్నారు. (వేడుకలు ఆరంభం) మిహికా, వెంకటేష్ కుమార్తె ఆశ్రిత క్లాస్‌మెట్. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం. అయితే లాక్‌డౌన్‌కు ముందే మిహికా యస్ చెప్పడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మే 12న రానా మిహికాతో ఉన్న ఫోటోను షేర్ చేసి.. తమ ప్రేమ గురించి ప్రపంచానికి తెలిపాడు. ఆ తర్వాత మే 21న వారి రోకా వేడుక జరిగింది. రానా మాట్లాడుతూ.. ‘కొన్ని నెలల క్రితం.. మిహికాతో తిరిగి కనెక్ట్ అయ్యాను. అప్పుడు లైఫ్‌లాంగ్ ఆమెతో సంతోషంగా ఉంటానని అర్థమయ్యింది. ఫోన్లో నేను ఏం అడగబోతున్నానో తనకు తెలుసు. అందుకే వ్యక్తిగతంగా కలిసి.. ముందు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడాను. తను మొదట షాక్ అయ్యింది.. కానీ సంతోషంగా ఉంది’ అని చెప్పారు. (బాహు.. భళ్లా... మళ్లా! )
- 
      
                   
                                 వేడుకలు ఆరంభంరానా, మిహికా ఆగస్ట్ 8న ఏడడుగులు వేయబోతున్నారు. ‘‘మేం ప్రేమలో ఉన్నాం’’ అని రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేయడం తెలిసిందే. పెళ్లి తేదీ ఖరారు చేయడానికి ఇరు కుటుంబాలు కలిసినప్పుడు ‘రోకా’ ఫంక్షన్ జరిగింది. అయితే ఇది నిశ్చితార్థ వేడుక కాదని దగ్గుబాటి కుటుంబం తెలిపింది. రెండు కుటుంబాలూ ఫార్మల్గా కలిశామని చెప్పారు. ఇక పెళ్లి తేదీ దగ్గరపడటంతో రానా, మిహికా ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన ఓ ఫొటోషూట్ని మిహికా షేర్ చేశారు. డిజైనర్ డ్రెస్, డిజైనర్ నగల్లో మిహికా మెరిసిపోయారు. ‘‘ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (పెళ్లికి ముందు జరిగే వేడుకలు) బాగా జరగడానికి కారణం అవుతున్న అందరికీ ధన్యవాదాలు. ఇది నాకు చాలా చాలా స్పెషల్ డే’’ అంటూ ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. కాగా, డ్రెస్‌కి మ్యాచింగ్‌గా డిజైనర్ మాస్కులు కూడా తయారు చేయించుకున్నారు మిహికా. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా రానా, మిహికాల పెళ్లి వేదిక అని సమాచారం.
- 
      
                   
                                 రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!టాలీవుడ్ అందగాడు రానా దగ్గుబాటి- మిహికా బజాజ్‌ల వివాహం ఆగస్ట్ 8న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఇప్పటి నుంచే పెళ్లి పనుల్లో మునిగిపోయాయి. ఈ విషయాన్ని కొత్త పెళ్లి కూతురు మిహికా బజాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. వేడుకలు కొనసాగుతున్నాయంటూ తన ఫొటోను పంచుకుంది. ఇందులో వధువుగా ముస్తాబైన మిహికా రాయల్ లుక్‌లో మెరిసిపోతోంది. ధగధగ మెరిసిపోతున్న నగలు ధరించిన ఆమె చిరునవ్వులు చిందిస్తోంది. ఆమె ముఖంలో పెళ్లి కళ కొట్టొచినట్లు కనిపిస్తోంది. (ఆగస్టులోనే రానా పెళ్లి) ఈ ఫొటో చూస్తుంటే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ప్రారంభమైనట్లే తెలుస్తోంది. కాగా లాక్డౌన్ నిబంధనల వల్ల కొద్ది మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరిపించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ పెళ్లి వేడుకను ఎక్కడ నిర్వహించనున్నారనేది ఇంకా వెల్లడించలేదు. కాగా తాను ప్రేమలో ఉన్నానంటూ రానా గత నెలలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే. అయితే ప్రేమ విషయాన్ని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకోవడం విశేషం. అటు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. (ఇది ఆరంభం.. ఇక ఎప్పటికీ: మిహీకా)
- 
      
                   
                                 రానా పెళ్లి వాయిదాపై స్పష్టతదగ్గుబాటి వారసుడు రానా పెళ్లి బాజాలు మోగించనున్నాడనగానే బ్యాచిలర్స్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్తా పెళ్లి రూటు వైపు వెళ్లిపోతున్నాడేంటని ఎందరో బ్యాచిలర్స్ గుండెలు మండిపోయాయి. ఈ విషయం కాసేపు పక్కన పెడితే తాను ప్రేమించిన అమ్మాయి మిహికా బజాజ్‌ను మనువాడే ఘడియల కోసం రానా పడిగాపులు కాస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రేమజంటను వివాహ బంధంతో ఒక్కటి చేసేందుకు ఆగస్టు 8న ముహూర్తం నిశ్చయించినట్లు ఇరువైపుల కుటుంబాలు ఇదివరకే ప్రకటించాయి. (ప్లాన్ ఎ... ప్లాన్ బి... ప్లాన్ సి!) ఇందుకోసం ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటినుంచే పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు కూడా! అయితే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసే అవకాశాలున్నాయంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. రానా-మిహికాల పెళ్లి ఆగస్టులో జరగడం లేదని ఇవి పేర్కొన్నాయి. ఈ పుకార్లపై స్పందించిన వధూవరుల కుటుంబ సభ్యులు వాటిని అసత్య ప్రచారాలుగా కొట్టివేశారు. గతంలో చెప్పిన తారీఖుకే పెళ్లి జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. కరోనా మరింత భయపెట్టినా, లాక్డౌన్ మరోసారి పొడిగించినా, ఇంకే విపత్తు వచ్చినా రానా పెళ్లి మాత్రం జరిగే తీరుతుందంటున్నారు. (ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్)
- 
      
                   
                                 ప్లాన్ ఎ.. ప్లాన్ బి.. ప్లాన్ సి!ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేయడానికి రానా రెడీ అవుతున్నారు. రానా, మిహికాల వివాహం ఈ ఏడాది ఆగస్టు 8న జరగనుంది. పెళ్లి సంబరాలు మూడు రోజులు జరుగుతాయని తెలుస్తోంది. ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రీ–వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు వధూవరుల కుటుంబ సభ్యులు. అతి కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా, మిహికాల పెళ్లి జరగబోతోంది. ‘‘పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరుగుతాయి. పెళ్లికి 80 నుంచి 100 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. కానీ ఆగస్టు సమయానికి పరిస్థితులు మారిపోవచ్చు. ప్రభుత్వ నియమాల్లో కొన్ని సడలింపులు ఉండవచ్చు. అలా జరిగినట్లయితే విదేశాల్లో ఉన్న మా బంధుమిత్రులు ఈ వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వెడ్డింగ్ థీమ్, డెకరేషన్ వంటి వాటిపై వర్క్ జరుగుతోంది. కానీ కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ప్రభుత్వ నియమాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మా ప్రయత్నంలో భాగంగా మేం ప్లాన్ ఎ, ప్లాన్ బి, ప్లాన్ సీలను రెడీ చేస్తున్నాం’’ అని మిహికా బజాజ్ తల్లి బంటీ బజాజ్ పేర్కొన్నారు.
- 
      
                   
                                 రానా పెళ్లి ముహూర్తం ఫిక్స్..లాక్‌డౌన్‌కు ముందు లవ్ కన్ఫర్మ్ అయిన హీరో రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులేసేందుకు ఎదురు చూస్తున్నాడు. "ఇట్స్ మై లగ్గం టైమ్" అంటూ బ్యాచిలర్ లైఫ్‌కు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే రామానాయుడు స్టూడియోలో రోకా ఫంక్షన్‌తో పెళ్లి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఇప్పట్లో పెళ్లి తంతు పెట్టుకోరు, డిసెంబర్లో వివాహం జరుగుతుండొచ్చు అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు ఆగస్టులోనే పెళ్లి చేసేయాలనుకుంటున్నారట. (ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్) ఆగస్టు 8వ తేదీన మంచి ముహూర్తం ఉందని, ఆ రోజే ఈ ప్రేమపక్షులను పెళ్లి బంధంతో కలిపేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. హైదరాబాద్‌లోనే జరగనున్న ఈ పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా వచ్చినా, ఇంకేదైనా ప్రళయమే వచ్చినా పెళ్లి ఆగేదే లేదని నిఖిల్ తన ప్రేయసి పల్లవికి మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. దీంతో రానా కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. హీరో నితిన్ మాత్రం నిశ్చితార్థం జరిగినా పెళ్లిని వాయిదా వేస్తూ ఇంకా మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాడు. (అమ్మాయిని కలిశాను, నచ్చింది, ఓకే అనుకున్నాం)
- 
      
                   
                                 రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీకుటుంబమంతా ఒక్కచోట చేరితే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం ఇలాంటి ఆనందాన్నే ఆగ్రనటి సమంత అక్కినేని ఆస్వాదిస్తున్నారు. ఇలా కుటుంబం అంతా ఒక్కచోటుకు చేరడానికి కారణమైన తన కజిన్ రానాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ మిహీకా బజాజ్‌ను రానా పెళ్లాడనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రామానాయుడు స్టూడియోలో రోకా ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలు హాజరై సందడి చేశారు. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత ఒకేసారి కుటుంబసభ్యులందరినీ కలవడంతో సమంత ఆనందంతో ఎగిరిగంతేశారు. అంతేకాకుండా రానా రోకా ఫంక్షన్లో కుటుంబంతో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘2020లో మాకు శుభవార్త చెప్పినందుకు రానా, మిహీకాలకు ధన్యవాదాలు. మీరు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ సమంత పోస్ట్ చేశారు. దీనికి విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత కూడా ‘నిజంగానే ది బెస్ట్ న్యూస్’ అని కామెంట్ చేశారు. ఇక రోకా ఫంక్షన్‌కు సంబంధించిన మరిన్ని ఫోటోలను సమంత తన అభిమానులతో పంచుకున్నారు. అయితే లాక్డౌన్ స్వల్ప విరామం తర్వాత సమంత చాలా ఎంజాయ్ చేసినట్లు ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక గ్రూప్ ఫోటోలో కూడా సమంత కోసం నెటిజన్లు ఎక్కువగా వెతికడం మరో విశేషం. చదవండి: నా భర్త ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో కదా? ఇది ఆరంభం.. ఇక ఎప్పటికీ: మిహీకా View this post on Instagram Thankyou for bringing us the best news of 2020 ❤️ @ranadaggubati @miheeka ... here’s to your happily ever after 🎂🤗👰🤵🥂.. 📷 @tpt.toast A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 21, 2020 at 7:13pm PDT


