‘రానా – మిహికా.. ఆగస్ట్‌ 8, 2020’

Rana Daggubati and Miheeka get 3D impressions of their hands - Sakshi

చేతిలోన చెయ్యేసి ఓ మధుర జ్ఞాపకాన్ని సృష్టించుకున్నారు టాలీవుడ్‌ కొత్త జంట రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌. ఈ కొత్త జంట చేతిలో చెయ్యేసుకొని, దాన్ని 3డీ మోడల్‌లో ఓ గుర్తుగా మలుచుకున్నారు. ప్రముఖ ఆర్టిస్ట్‌ భావనా జస్ర దగ్గర ఈ త్రీడీ మోడల్‌ను చేయించుకున్నారు. ముందుగా వీరి చేతులను త్రీడీ ఉపయోగించి, బంక మట్టితో కొలతలు తీసుకున్నారు. ఒకరి చేయిని మరొకరు పట్టుకున్న మౌల్డ్‌ను తయారుచేసి, దానికి బంగారు పూత పూస్తారు. ‘రానా – మిహికా. ఆగస్ట్‌ 8, 2020’ అంటూ వాళ్ల పెళ్లి తేదీకి గుర్తుగా ఈ త్రీడీ మోడల్‌ చేయించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top