రానా పెళ్లిసందడి | Rana Daggubati and Miheeka Bajaj Wedding | Sakshi
Sakshi News home page

రానా పెళ్లిసందడి

Aug 9 2020 5:33 AM | Updated on Aug 9 2020 5:33 AM

Rana Daggubati and Miheeka Bajaj Wedding - Sakshi

శనివారం రానా ఒక ఇంటివాడయ్యాడు. మిహికా బజాజ్‌కి మూడుముళ్లు వేసి, ఆమెతో కలిసి ఏడడుగులు నడిచారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ డిజైనర్‌ అనామికా ఖన్నా డిజైన్‌ చేసిన గోల్డ్‌ మరియు క్రీమ్‌ కలర్‌ లెహంగాను ధరించారు మిహికా.

ఈ డ్రెస్‌ డిజైన్‌ చేయడానికి సుమారు పదివేల గంటలు పట్టిందట. కేవలం చేతిపని కావడంతో ఇన్ని గంటలు పట్టిందని సమాచారం. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరుకుటుంబాలకు బాగా దగ్గరైన ప్రముఖులు హాజరయ్యారు. మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  

రానా, మిహికా, రామ్‌చరణ్, ఉపాసన


దగ్గుపాటి సురేష్, రానా, వెంకటేశ్‌


కుటుంబ సభ్యులతో రానా, మిహికా

Advertisement
 
Advertisement
Advertisement