Rana Daggubati And His Wife Miheeka Bajaj Expecting Their First Child Together? - Sakshi
Sakshi News home page

Rana Daggubati-Miheeka Bajaj : త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పనున్న రానా-మిహికా?

Oct 28 2022 10:36 AM | Updated on Oct 28 2022 11:18 AM

Rana Daggubati Wife Miheeka Bajaj Pregnancy Rumours Goes Viral - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్‌ జంట ఒకటి. 2020 ఆగస్టు8న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు రానా భార్య ప్రెగ్నెంట్‌ అంటూ టాక్‌ వినిపిస్తుంది. మిహికా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. అయితే రీసెంట్‌గా మిహికా షేర్‌చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. దీంతో ఓ ఫ్యాన్‌ మిహికా పోస్టుపై స్పందిస్తూ.. మీరు ప్రెగ్నెంటా అని అడగ్గా.. నేను హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌లో ఉన్నాను. అందుకే ఈ మధ్య కాస్త హెల్దీగా మారాను అంటూ మిహికా రిప్లై ఇచ్చింది. దీంతో మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయ్యింది.  

Advertisement
 
Advertisement
Advertisement