టాలీవుడ్ హీరో రానా(Rana Daggubati ) తండ్రి కాబోతున్నారు. త్వరలోనే దగ్గుబాటి ఇంట్లోకి వారసుడు/ వారసురాలు రాబోతున్నారు. రానా సతీమణి మిహిక బజాజ్(Miheeka Bajaj) గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని రానా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఓ మంచి రోజు చూసి ఈ గుడ్ న్యూస్‌ని తన అభిమానులతో పంచుకోవాలని రానా భావిస్తున్నారట.

గతంలోనూ మిషికా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఈ వార్తలను రానా దంపతులిద్దరూ కొట్టిపారేశారు. చాలా కాలం తర్వాత మరోసారి రానా తండ్రి కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ సారి కూడా పుకారుగానే మిగిలిపోతుందా? లేదా నిజంగానే రానాకి ప్రమోషన్ వచ్చిందా అనేది తెలియాలంటే వాళ్లు స్పందించేవరకు ఆగాల్సిందే.

రానా, మిహికాలది ప్రేమ వివాహం. ముంబైలో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేసే మిహీకా స్వస్థలం హైదరాబాద్. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. కానీ లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడినట్లు ఓ ఇంటర్వ్యూలో రానా చెప్పారు. వీరిద్దరి పెళ్లి 2020 ఆగస్టు 8న జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. రానా వారసత్వంగా వస్తున్న వ్యాపారాలను చూసుకుంటూనే.. నిర్మాతగా, నటుడిగానూ కొనసాగుతున్నాడు.


