Bigg Boss 5: బిగ్‌బాస్‌లో నా ఫ్రెండ్‌కే ఓటేయండంటున్న మిహికా బజాజ్‌

Bigg Boss 5 Tamil: Miheeka Bajaj Supports BB Contestant Akshara Reddy - Sakshi

Miheeka Bajaj Supports Tamil Bigg Boss Contestant Akshara Reddy: బిగ్‌బాస్‌ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర అభిమానులను ఎంతగానో అలరించే ఈ షో ప్రతియేటా కొత్త కంటెస్టెంట్లతో, కొంగొత్త గేమ్స్‌తో సరికొత్తగా ముస్తాబవుతూ మన ముందుకు వస్తుంటుంది. ప్రస్తుతం తెలుగులో కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ విజయవంతంగా ప్రసారమవుతోంది. అటు తమిళంలోనూ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా ఐదో సీజన్‌ రన్‌ అవుతోంది. అక్టోబర్‌ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. ఈమె ఒక మోడల్‌, మిస్‌ గ్లోబ్‌ 2019 అవార్డు గ్రహీత కూడా! గతంలో 'విల్లా టు విలేజ్‌' అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. అలాగే 'కసు మెలా కసు' అనే మలేషియన్‌ మూవీలోనూ తొలిసారి నటించింది.

తాజాగా ఈ అక్షరకు సపోర్ట్‌గా నిలబడిందో టాలీవుడ్‌ హీరో భార్య. భళ్లాలదేవ రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్‌ అక్షరకు సపోర్ట్‌ చేయండంటూ వీడియో రిలీజ్‌ చేసింది. 'బిగ్‌బాస్‌ తమిళ ఐదో సీజన్‌లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు.  పాల్గొన్న నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్‌ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్‌ ద బెస్ట్‌' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top