హ‌నీమూన్‌లో రానా-మిహికా జంట‌

Rana Daggubati And Miheeka Bajaj Honeymoon Photo - Sakshi

హీరో రానా ద‌గ్గుబాటి మిహికా బ‌జాజ్‌కు మూడు ముళ్లు వేసి వివాహ బంధంలో అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. గ‌త నెల ‌8న వీరి పెళ్లి హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో త‌క్కువ మంది స‌మ‌క్షంలోనే గ్రాండ్‌గా జరిగింది. ఆ స‌మ‌యంలో రానా- మిహికా జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు విప‌రీతంగా వైర‌ల్ అయ్యాయి కూడా. తాజాగా ఈ దంపతులు హ‌నీమూన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు మిహికా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోయే నిద‌ర్శ‌నం. ‌భ‌ర్త‌ కోస‌మే ఇలా.. అంటూ క్యాప్ష‌న్ కూడా జోడించారు. ఇందులో మిహికా సాగ‌ర తీరాన భ‌ర్త‌తో క‌లిసి ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నారు. (చ‌ద‌వండి: పెళ్లి పందిట్లో చైతూ, స‌మంత చిలిపి ప‌ని)

ఈ క్ర‌మంలో ఇసుక‌లో ప‌డుకుని క‌బుర్లు చెప్తున్న స‌మ‌యంలో భార్య‌ను సెల్ఫీలో బంధించారు రానా. కాగా మిహికా పెళ్లి త‌ర్వాత శ్రీవారితో క‌లిసి దిగిన తొలి ఫొటో ఇదే కావ‌డం విశేషం. ఇంత‌కీ ఈ హ‌నీమూన్ ఎక్క‌డ అనే విష‌యం మాత్రం స‌స్పెన్స్‌గా ఉంది. అయితే గ‌తంలో హ‌నీమూన్ ట్రిప్ గురించి రానా మాట్లాడుతూ.. ఆమ్‌స్ట‌ర్‌డ్యామ్‌లో హ‌నీమూన్ ప్లాన్ చేశామ‌ని తెలిపారు. త‌న‌కు ఆర్ట్ అంటే ఇష్ట‌మ‌ని, ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది, కాబ‌ట్టి అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాన‌ని పేర్కొన్నారు. త‌న భార్య కూడా ఆ ప్ర‌దేశానికి వెళ్లేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌న్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక అక్క‌డికి షికారుకు వెళ్తామ‌ని చెప్పారు. దీన్నిబ‌ట్టి చూస్తే ఈ కొత్త జంట ఆమ్‌స్ట‌ర్‌డ్యామ్‌కే వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: సర్వస్వం నువ్వే.. లవ్‌ యూ: మిహికా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top