ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్‌తో రానా దగ్గుబాటి..! | Rana Daggubati collabartion with kollywood star director | Sakshi
Sakshi News home page

Rana Daggubati: ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్‌తో రానా దగ్గుబాటి..!

Mar 17 2026 7:44 AM | Updated on Mar 17 2026 10:48 AM

Rana Daggubati collabartion with kollywood star director

సినీ ఇండస్ట్రీలో ఒక రేర్‌ కాంబినేషన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ  వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్‌ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే  దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా.. కార్తీక్‌ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్‌బెంట్‌ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్‌ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్‌ వర్గాలు ఎక్స్‌ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement