Karwa Chauth 2020: రానా- మిహికల కర్వాచౌత్‌ ఎలా జరిగిందంటే | Rana and Mihika Bajaj Celebrated the Festival with Treditional Look - Sakshi
Sakshi News home page

రానా- మిహికల కర్వాచౌత్‌ ఎలా జరిగిందంటే...

Nov 5 2020 3:54 PM | Updated on Nov 5 2020 5:27 PM

Rana and Mihika Bajaj Celebrated Karwa Karwa Chauth - Sakshi

రానా దగ్గుబాటి- మిహిక బజాబ్‌ల జట్ట పెళ్లైన తొలి ఏడాది వస్తున్న అన్ని పండగలను చాలా సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు. దసరా పండుగ రోజు తర్వాత తాజాగా కర్వా చౌత్‌ను కూడా ఈ జంట చాలా ఆనందంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను మిహిక తల్లి బంటి బజాబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో ఎరుపు రంగు చీర ధరించి, సంప్రదాయమైన నగలను మిహిక ధరించింది.



నుదుట కుంకుమ, బంగారు రంగు చెవి దిద్దులు, ముక్కు పుడక పెట్టుకొని తెలుగమ్మాయిలా కనిపించింది. ఇక రానా లుక్‌ విషయానికి వస్తే ఎప్పటిలాగే సింపుల్‌గా కనిపించాడు. బ్లాక్‌ కలర్‌ టీ షర్ట్ జీన్స్‌ వేసుకున్నాడు. ఈ ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను కూడా బంటి బజాజ్‌ తన సోషల్ ‌మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. హ్యాపీ కర్వా చౌత్‌, గాడ్‌ బ్లెస్ యూ అంటూ ఆమె ఈ ఫోటోలను పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement