జై హనుమాన్‌లో... | Actress Mamitha Baiju to Enter Jai Hanuman Sequel | Sakshi
Sakshi News home page

జై హనుమాన్‌లో...

Oct 12 2026 4:23 AM | Updated on Oct 12 2026 4:23 AM

Actress Mamitha Baiju to Enter Jai Hanuman Sequel

‘జై హనుమాన్‌’ సినిమాలో మమితా బైజు నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న సినిమా ‘జై హనుమాన్‌’. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ లీడ్‌ క్యారెక్టర్‌లో రానా నటిస్తున్నారని తెలిసింది. తాజాగా మరో లీడ్‌ క్యారెక్టర్‌లో మమితా బైజు నటిస్తున్నారని, ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారని సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఇక ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన సూపర్‌హిట్‌ సినిమా ‘హను మాన్‌’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘ప్రేమలు, విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ వంటి చిత్రాలతో మమితా బైజు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement