Samantha: రానా భార్య ఫోటోకి కామెంట్‌ చేసిన సమంత

Samantha Reacts On Rana Daggubati Wife Miheeka Bajaj Photo - Sakshi

టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి సంబంధించిన ఎప్పటికప్పుడు పోస్టులు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రెండ్‌ వెడ్డింగ్‌లో రానా- మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా నెటిజన్లతో పాటు సమంత కూడా రియాక్ట్‌ అయ్యింది. చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న రానా భార్య? పోస్టుతో క్లారిటీ 

'నీ అవుట్‌ఫిట్‌ నాకు నచ్చింది' అంటూ మిహికా పోస్టుకు సమంత కామెంట్‌ చేయగా థ్యాంక్యూ.. అంటూ ఆమె మిహికా ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా నాగచైతన్యతో విడిపోయినప్పటికీ సమంత ఆ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉండటం విశేషం.

వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత, మిహికాలతో పాటు పలువురితో సమంతకు ఇప్పటికీ మంచి ఫ్రెండిప్‌ ఉంది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలోనూ నాగ చైతన్య మినహా నాగార్జున, అఖిల్‌ సహా అక్కినేని కుటుంబసభ్యులను సమంత ఇప్పటికీ ఫాలో అవుతుంది. చదవండి: సమంతకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top