'అదే నీతో ప్రేమలో పడేలా చేస్తుంది'.. రానా భార్య మిహికా క్యూట్‌ పోస్ట్‌‌ | Sakshi
Sakshi News home page

Miheeka : వలెంటైన్స్‌ డే స్పెషల్‌.. రానాతో స్పెషల్‌ ఫోటోను షేర్‌ చేసిన మిహికా

Published Tue, Feb 14 2023 12:02 PM

Rana Daggubati Wife Miheeka Special Post On Valentines Day - Sakshi

ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు తమ వలెంటైన్స్‌తో కలిసి ఉన్న స్పెషల్‌ మూమెంట్స్‌ని షేర్‌ చేసుకుంటున్నారు. టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భర్త రానాతో కలిసి దిగిన ఓ క్యూట్‌ ఫోటోను షేర్‌చేస్తూ.. ''నేను స్ట్రాంగ్‌, స్వీట్‌, వైల్డ్‌, ఇంకా వండర్‌ఫుల్‌.

నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవడం లేదు. అందుకే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు..(ఫన్నీ ఎమోజీ). రోజంతా నువ్వు నన్ను విసిగించినా నీ నవ్వు మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలైంటైన్స్‌ డే రానా'' అంటూ తన భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. ఈ పోస్ట్‌ చూసి వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత సహా పలువురు నెటిజన్లు క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement