breaking news
Rama naidu studio
-
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు.వివరాల ప్రకారం.. నగరంలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేసినట్టు వెల్లడైంది. దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియో 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తోంది. అలాగే, రామానాయుడు స్డూడియో 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత సినీ పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియోకు 1976లో భూమి కేటాయించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ ప్రాంతంలో సుమారు 22 ఎకరాల భూమిని కేటాయించారు. తరువాతి కాలంలో పద్మాలయ స్టూడియోకు, 1989లో రామానాయుడు స్టూడియోకు 7.5 ఎకరాలూ కేటాయిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. -
రానా సతీమణి మిహికా సరికొత్త ఈవెంట్.. హైదరాబాద్‌లోనే తొలిసారిగా!
హైదరాబాద్ సరికొత్త ఈవెంట్‌కు వేదికగా నిలవనుంది. ఆర్ట్ కనెక్ట్ ఆధ్వర్వంలో సరికొత్త కాంటెపరరీ నౌ అనే కళాత్మక కార్యక్రమం జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 34 మంది సీనియర్ కళాకారుల కళలను ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో తొలిసారి ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ ప్రదర్శన నవంబర్ 21 నుంచి 25 వరకు ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియో సమీపంలో ఉన్న స్పిరిట్ కనెక్ట్‌లో జరగనుంది.ఈ ఈవెంట్లో చెన్నైకి చెందిన అశ్వితాస్‌తో కలిసి ఓజాస్ ఆర్ట్, అసైన్, ఆర్చర్ ఆర్ట్ గ్యాలరీ, ఆర్ట్ అలైవ్ గ్యాలరీతో కలిసి ఆర్ట్ షోను ఆర్ట్ కనెక్ట్ హైదరాబాద్ ప్రదర్శించనుంది. ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు.. కళలను ప్రతిబింబించడానికి, ప్రారంభించడానికి ఇదొక ఆహ్వానమని ఆర్ట్ కనెక్ట్ వ్యవస్థాపకురాలు, రానా సతీమణి మిహీకా దగ్గుబాటి తెలిపారు.ఈ సందర్భంగా అశ్విత డైరెక్టర్ అశ్విన్ ఈ రాజగోపాలన్ మాట్లాడుతూ.. 'ఆర్ట్ కనెక్ట్‌తో మా సహకారం ఆలోచనాత్మక, సాంస్కృతిక సంభాషణకు భాగస్వామ్యంలాంటిది. జ్ఞాపకశక్తి, గుర్తింపు, రూపంతో మాట్లాడే రచనలను ఎదుర్కొనే అరుదైన అవకాశాన్ని కాంటెంపరరీ నౌ అందిస్తుందని' అన్నారు. -
ఘనంగా ప్రారంభమైన అశ్విన్ బాబు కొత్త సినిమా
‘రాజుగారి గది’ ఫేం అశ్విన్ బాబు కొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత అశ్విన్ నటిస్తున్న ఈ చిత్రం ఇది. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వచ్చిన వాడు గౌతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీఎస్సార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఎంఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర ఓపెనింగ్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్రలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
షాక్.. మళ్లీ మూతపడనున్న థియేటర్లు?
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ అనంతరం ఇటీవలె తెరుచుకున్న థియేటర్లు తెలంగాణలో మళ్లీ మూతపడేలా కనిపిస్తున్నాయి. సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు నెలకొన్న వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మల్టీప్లెక్సులకు ఉండే హక్కులనే సింగిల్ స్క్రీన్లకు కూడా వర్తింపజేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మల్టీపెక్సుల మాదిరే పర్సంటేజ్ సిస్టమ్‌ను అమలుచేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా పెద్ద సినిమా అయితే విడుదలైన 6వారాల తర్వాత, అదే చిన్న సినిమా అయితే 4వారాల గ్యాప్ తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 1నుంచి థియేటర్లు మూసివేస్తామని హెచ్చరించారు.(ఆ సీన్లలో నటించడం తగ్గించేశా: సుమంత్) ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు.. తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ల మధ్య చర్చలు జరిగాయి. దగ్గుబాటి సరేష్‌బాబు ఏర్పాటైన ఈ సమావేశంలో డివివి దానయ్య, అభిషేక్ నామా, మైత్రి రవి, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ అనంతరం తిరిగి తెరుచుకున్న థియేటర్లలో సినిమాల సందడి పెరిగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాలు సైతం భారీగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్‌లోనూ చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లకు నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (మండుటెండలో మట్టిలో కూర్చున్న మహేశ్ డైరెక్టర్) -
అందుకే... 33 రోజుల్లో పూర్తి చేశా!
‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘ఉయ్యాల - జంపాల’ చిత్రాలు నిర్మించి విజయాలందుకొన్న నిర్మాత పి. రామ్మోహన్. ఆయన ఇప్పుడు దర్శకుడిగా ముందుకొస్తున్నారు. సంతోష్ శోభన్, అవికాగోర్ జంటగా రామ్మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తను - నేను’ ఈ 27న రిలీజ్. ఈ సందర్భంగా ఆయన సినీ అనుభవాలు ఆయన మాటల్లోనే... * నేను ఎంబీఏ చదివా. వ్యాపారం చేసుకొంటున్న సమయంలో డి. సురేశ్‌బాబుతో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతో రామానాయుడు స్టూడియోలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకొనేందుకు చేరాను. చిత్ర నిర్మాణానికి సంబంధించి ఓనమాలు నేర్చుకున్నాను. ప్రొడక్షన్ విలువలు, కథల గొప్పతనం గురించి రామానాయుడు గారి నుంచి తెలుసుకున్నా. * రామానాయుడు ఫిలిమ్ స్కూల్లో చదువుకున్న సాయి రమేశ్ అనే కుర్రాడు ‘తను- నేను’ చిత్రం కథ నాకు అమ్మేసి, అమెరికా వెళ్లిపోయాడు. మూడేళ్ళుగా నా దగ్గరే ఉందీ కథ. ఈ కథతో దర్శకులను కలిస్తే రకరకాల కారణాలతో వారు సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. ఇక నేనే దర్శకత్వం వహించాలని సురేశ్‌బాబు గారితో అన్నా. ‘తప్పకుండా మీరే చేయండి’ అంటూ రానా అన్నాడు. అలా చివరకు సురేశ్‌బాబు సపోర్ట్‌తో సినిమా పూర్తి చేశా. * నా ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో పనిచేసిన సంతోశ్ శోభన్ ‘తను-నేను’ ఆడిషన్స్‌కి వచ్చాడు. వెంటనే, ఓకే చేప్పేశా. * ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో రవిబాబు కనిపిస్తారు. ఆయనతో పనిచేయడానికి మొదట్లో చాలా టెన్షన్ పడేవాడిని. చాలా సీన్స్‌లో టెక్నికల్‌గా ఆయన నన్ను గైడ్ చేసేవారు. * మూడేళ్ళుగా ఈ స్క్రిప్ట్‌పై అవగాహన ఉండటంతో నాకు ఏం కావాలో బాగా తెలుసు. ప్రతి ఫ్రేమ్ నా మైండ్‌లో ఉండేది. ఆర్టిస్టులతో ముందుగా 45 రోజులు రిహార్సల్స్ చేయించా. అందుకే, ఈ షూటింగ్ 33 రోజుల్లో పూర్తి చేయగలిగా. * ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథ ఐడియా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెబితే నేను అది డెవలప్ చేసి ఇచ్చాను. యువ హీరోలతో సినిమాలు చేయాలనుంది, కానీ ‘తను -నేను’ రిలీజ్ అయ్యాక వచ్చే స్పందనను బట్టి ఆలోచిస్తా. * విశ్వదేవ్, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పిట్టగోడ’ సినిమా నిర్మాణం ప్రారంభిస్తున్నా. -
నచ్చినట్టు జీవిస్తా..
హ్యాపీగా, జోవియల్‌గా ఉండడం తనకు నచ్చుతుందని, జీవితాన్ని నచ్చినట్టు గడపడమే ఇష్టమని అంటోంది టాలీవుడ్ హీరోయిన్ రిచాపనై. యుముడికి మొగుడు (కొత్తది) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా... డిసెంబరు 31న నానక్‌రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్న న్యూ ఇయర్ ఈవెంట్ ఎనౌన్స్మెంట్ కార్యక్రమంలో పాల్గొంది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ‘సిటీప్లస్’తో తన మనోభావాలిలా పంచుకుంది... మాది ఉత్తరాఖండ్. పుట్టి పెరిగింది లక్నో. చదువుకుంటూ ఉండగా మోడలింగ్ చేసేదాన్ని. ట్వల్త్ స్టాండర్డ్‌లో మిస్ లక్నోగా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశా. కలలు కన్న విధంగానే ఎయిర్‌హోస్టెస్ అయ్యా. అయితే మోడలింగ్‌ను మాత్రం వదలలేక హాబీగా కంటిన్యూ చేశా. కొన్ని జ్యువెలరీ యాడ్స్ ద్వారా నన్ను చూసిన నిర్మాతలు ‘యుముడికి మొగుడు’ ఆఫర్ ఇచ్చారు. అలా సినీనటిని అయిపోయా. కంఫర్ట్‌గా... అది 100 రూపాయల డ్రెస్ కావచ్చు, టెన్ థౌజెండ్ వర్త్ కావచ్చు... కంఫర్ట్‌గా మనం క్యారీ చేయగలిగితేనే దాని లుక్ ఆకట్టుకుంటుంది. విభిన్న రకాల డ్రెస్‌లు ఉండడం ఆడపిల్లల అదృష్టం అనే చెప్పాలి. వెరైటీ డ్రెస్సింగ్ అంటే నాకు ఇష్టం. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని హ్యాపీగా నచ్చినట్టు జీవించాలనుకుంటాను. ఇది పార్టీల సీజన్... క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను మిస్ కాను. ట్రీ డెకరేషన్, ఇంటి పైన స్టార్స్... రిలెటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాలు... గ్రీటింగ్ కార్డ్స్, న్యూ ఇయర్ విషెస్... ఓహ్... భలే సందడిగా ఉంటుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఈ వేడుకల్ని హైదరాబాద్‌లో సెలబ్రేట్ చేసుకోవడమంటే నాకు బాగా ఇష్టం. లక్నో కన్నా ఇక్కడి వెదర్ చాలా బాగుంటుంది. రాజమౌళి దర్శకత్వం అద్భుతం. మహేష్‌బాబుతో నటించడం నా డ్రీమ్. - శిరీష చల్లపల్లి


