ఘనంగా ప్రారంభమైన అశ్విన్‌ బాబు కొత్త సినిమా | Sakshi
Sakshi News home page

Ashwin Babu: రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైన అశ్విన్‌ కొత్త చిత్రం

Published Fri, Dec 30 2022 8:14 PM

Ashwin Babu New Movie Vachinavadu Gautham Movie Starts in Rama Naidu Studio - Sakshi

‘రాజుగారి గది’ ఫేం అశ్విన్‌ బాబు కొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. చాలా గ్యాప్‌ తర్వాత అశ్విన్‌ నటిస్తున్న ఈ చిత్రం ఇది. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో  పాలక్  లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వచ్చిన వాడు గౌతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీఎస్సార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఎంఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

శుక్రవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర ఓపెనింగ్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్రలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement