జోగి రమేష్ అరెస్ట్.. అప్‌డేట్స్
విజయవాడ:
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( ఆదివారం, నవంబర్ 2 వతేదీ) నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఆయన్ను అరెస్టు చేశారు.
ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు
జోగి రమేష్ అరెస్టును ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు
- మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి గుంజ శ్రీనివాస్, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు
- ఎటువంటి ఆధారాలు లేకుండా జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టారు
- ఇది ప్రభుత్వ పైశాచిక ఆనందం
- జోగి రమేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు.
- మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూడా కేసులు పెడుతున్నారు.. ఇది దుర్మార్గ పాలన కాదా?
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి వేల మంది వైఎస్సార్‌సీపీ సైనికుల గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి.
నెల్లూరు జైలుకు జోగి రమేష్
- జైలు మార్పుతో జోగి రమేష్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన
- విజయవాడ నుంచి ఆకస్మాత్తుగా నెల్లూరు తరలింపు
- నెల్లూరు జైలుకు జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాము
జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
- మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు.
- జోగి రమేష్ భార్య, కుమారులపై కేసు నమోదు చేసింది.
- జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినపుడు జీజీహెచ్‌లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టినట్టు ఫిర్యాదు
- మాచవరం పోలీసులకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదు
- గుణదల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా శ్రీనివాసరావు విధులు
- శ్రీనివాసరావు ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు
- ఏ1 గా జోగి రమేష్ భార్య శకుంతల దేవి , ఏ2 గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ , ఏ3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్‌లపై కేసు నమోదు
- నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది.
- ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం(నవంబర్ 2వ తేదీ) ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది.
- కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు.
- ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.
- జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.


