విజయవాడ సిటీ
మా గ్రామంలో లేనిది లేదు
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మచిలీపట్నంలోని
ప్రభుత్వ వైద్య కళాశాల
నా పేరు గుణ్ణం సూర్యనారాయణరెడ్డి. నా వయసు 94 ఏళ్లు. నా ఊహ తెలిసినప్పటి నుంచి మా ఊరు కాండ్రపాడులో ఏ మార్పూ రాలేదు. ఎప్పుడో నిర్మించిన పంచాయతీ శిథిల భవనం తప్ప. కొత్తగా ఏవీ రాలేదు. ఏ పని కావాలన్నా 22 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రం చందర్లపాడు వెళ్లాలి. అక్కడికి వెళ్తే కావాల్సిన అధికారి ఉండేవారు కాదు. ఇక వైద్యం కోసం నందిగామ వెళ్లాల్సిందే. ఇదంతా గతం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మా ఊరి స్వరూపమే మారిపోయింది. పాడుబడిన పంచాయతీ స్థానంలో కొత్త సచివాలయం వచ్చింది. 11 మంది ఉద్యోగులు గ్రామానికి వచ్చారు. వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుతో గ్రామంలోనే వైద్యం అందుతోంది. రైతు భరోసా కేంద్రంతోపాటు సకల వసతులతో పాఠశాల భవనం నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత స్థాయిలో మార్పు ఎన్నడూ చూడలేదు. ఐదేళ్ల జగన్ పాలనలో మా గ్రామ స్వరూపం మారింది. మౌలిక సదుపాయాలు వచ్చాయి. అంతర్గత రోడ్లు, డొంక రోడ్లు బాగుపడ్డాయి. నీటి కనెక్షన్లు వచ్చాయి. గతంలో ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి వెళ్లిన మేము ఆ ఐదేళ్లలో ఊరు దాటి బయటకు అడుగు పెట్టిందే లేదు. పాలనను మా వాకిళ్లలోకి తెచ్చిన జగన్ వెయ్యేళ్లు వర్ధిల్లాలి..
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


