మార్చి 6 నుంచి దుర్గగుడిలో మహా కుంభాభిషేకం
మూడు రోజుల పాటు నిర్వహణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై 2026 మార్చి 6వ తేదీ నుంచి మహా కుంభాభిషేకాన్ని నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. దేవస్థాన స్థానాచార్యులు, దుర్గగుడి వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా కుంభా భిషేక మహోత్సవ తేదీలను శనివారం ఖరారు చేశారు. దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు శనివారం సమావేశమయ్యారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేకం గురించి సుదీర్ఘంగా చర్చించి తేదీలను ఖరారు చేశారు. ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి అధికారులు సమాలోచన చేశారు. మార్చి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభి షేకాన్ని పురస్కరించుకుని చేపట్టే పూజలు, హోమాలు, ఇతర కార్యక్రమాల గురించి చర్చించారు. 8వ తేదీ ఉదయం పూర్ణాహుతితో మహా కుంభాభిషేక మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. మార్చి 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం, 4వ తేదీ తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, దర్శన ఏర్పాట్ల గురించి ఆలయ వైదిక కమిటీ సభ్యులు సమావేశంలో చర్చించారు. అనంతరం స్థానాచార్య శివప్రసాద్ శర్మ చైర్మన్, బోర్డు సభ్యులకు మహా కుంభాభిషేకం గురించి వివరించారు.
మైలవరం: క్రమశిక్షణగా ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని బాలికాభివృద్ధి అధికారి(జీసీడీఓ) బి.విశ్వభారతి తెలిపారు. మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఎన్టీఆర్ జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎం. రజనీకుమారి పర్యవేక్షణలో శనివారం జిల్లా స్థాయి కెరీర్ ఫెస్ట్ అండ్ ఎక్స్‌పో–2025 కార్యక్రమం జరిగింది. కెరీర్ ఫెస్ట్ ద్వారా విద్యార్థులకు విద్య ప్రాముఖ్యతను తెలియజేయడం, విద్యార్థుల అభిరుచులు, సామర్‌ాధ్యలకు అనుగుణంగా కెరీర్ ఎంపికలపై స్పష్టత కల్పిస్తారన్నారు. కెరీర్ ఫెస్ట్‌లో విజ్ఞాన సాంకేతిక, వాణిజ్య, వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం, వృత్తి విద్య, ఐటీ, పోలీస్, డిఫెన్స్ ప్రభుత్వ ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు తదితర విభాగాలకు సంబంధించిన 25 స్టాళ్లను ప్రదర్శించారు. ఆయా రంగాల నిపుణులు విద్యార్థులకు కోర్సుల వివరాలు, విద్యార్హతలు, ప్రవేశ పరీక్షలు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లాలోని 20 మండలాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ ప్రాజెక్టులకు, జిల్లా స్థాయిలో నిర్వహించిన క్విజ్, కెరీర్ పోస్టర్స్ తయారీ, ఒకేషనల్ డ్రస్ తదితర పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌లు అందజేశారు. యునిసెఫ్ కన్సల్టెంట్ సమగ్ర శిక్ష జి. ప్రియాంక, మైలవరం మండల ఎంఈఓలు ఎల్.బాలు, రాజు, ఎస్‌ఐ సుధాకర్, ఉపాధ్యాయులు, ఒకేషనల్ ట్రైనర్లు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ సంస్థకు రాష్ట్ర స్థాయి ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు వరించింది. విజయ వాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి, సీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి చేతుల మీదుగా ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ పి.శివరామాంజనేయులు శనివారం అవార్డు అందుకున్నారు. థర్మల్ ప్లాంటులో శక్తి వినియోగాన్ని తగ్గిస్తూ వినూత్నమైన శక్తి పరిరక్షణ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్రస్థాయిలో శక్తి పరిరక్షణ విభాగంలో రెండో స్థానం దక్కించుకుని సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడం సంస్థకు గర్వకారణమని సీఈ శివరామాంజ నేయులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సీఈకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు గోపాల్, వెంకటరావు, ఈఈలు సురేష్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ హరి పాల్గొన్నారు.


