కర్ణాటకలోని బెంగళూరులో ఇటీవల వెలుగులోకి వస్తున్న సైబర్ నేరాల కేసులు ఆందోళన రేపుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటూ జనాలను బెదిరించి, కోట్ల రూపాయలుదండుకుంటున్న వైనం కలకలం రేపుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ అంటూ ఒక ముఠా రెచ్చిపోయింది. అమెరికన్ల నుంచి కోట్లాది రూపాయలను కాజేసింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం హానికరమైన ఫేస్‌బుక్ ప్రకటనలు చేశారని అమెరికన్ వినియోగదారులను నమ్మించడమే కాదు, భద్రతా హెచ్చరికలు , సర్వీస్ లింక్స్ అంటూ వారిని మభ్యపెట్టింది. 'మైక్రోసాఫ్ట్ టెక్నీషియన్ల’ పేరుతో బెంగళూరుకు ఒక ముఠా అమెరికన్లకు భారీగా దోచేసింది.కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని వారి భయపెట్టి, ఫేక్ సేఫ్టీ సొల్యూషన్స్, నకిలీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) సమ్మతి విధానం అంట వారిని నమ్మించి కోట్ల రూపాయలను వారినుంచి రాబట్టింది సైబర్ నేరస్థుల ముఠా.
ఎలా అంటే ఒక యూజర్ ప్రకటనపై క్లిక్ చేసిన తర్వాత, కోడ్ కంప్యూటర్‌ను స్తంభింపజేసి, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లుగా ఒక ఫేక్ మెసేజ్ పాప్-అప్ అవుతుంది. దీనిమీద నకిలీ హెల్ప్‌లైన్ నంబర్ కూడా డిస్‌ప్లే అవుతుందని సీనియర్ ఒకరు అధికారి చెప్పారు. బాధితుడు ఆ నంబర్‌కు కాల్ చేయడానే వీళ్ల కపట దందాకు తెరలేస్తుంది. మైక్రోసాఫ్ట్ టెక్నీషియన్లుగా నటిస్తున్న మోసగాళ్ళు సిస్టం హ్యాక్,ఐపీ అడ్రస్ హ్యాక్ అయింని, దీంతో బ్యాంకింగ్ డేటా ప్రమాదంలో పడిందని బెదిరించారు. దీనికి పరిష్కారంగా ఫేక్ సేఫ్టీ సెక్యూరిటీ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. అమెరికాలో ఉంటున్న అనుమానాస్పద పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలతో నగరానికి చెందిన సైబర్ క్రైమ్ సిండికేట్‌తో సంబంధం ఉన్న 21 మందిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టు ముందు హాజరుపరిచారు, వారిని పోలీసు కస్టడీకి తరలించారు.
ఈ ముఠా నకిలీ "ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)" ఉల్లంఘనలను ఉదహరించి అనేక కోట్ల రూపాయలు దోచుకుంది. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్, వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందాలు సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్‌లోని డెల్టా భవనంలోని ఆరవ అంతస్తులో ఉన్న మస్క్ కమ్యూనికేషన్స్ కార్యాలయంపై దాడి చేసినట్టు తెలుస్తోంది. సెర్చ్ వారెంట్‌తో శుక్రవారం మరియు శనివారం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఆఫీసు యజమాని పాత్రపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.


