కులు: నూతన సంవత్సర వేళ విషాదం చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులులో ట్రక్క్‌ను కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని పోలీసులు నిర్థారించారు.
ఇవాళ (జనవరి 1, గురువారం) తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఘటన జరిగింది. కసోల్‌లో పుట్టినరోజు వేడుకలు, ఇయర్ వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా వీరి కారు రోడ్డుపక్కన నిలిపిన లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. కారులో ఇరుక్కుపోయిన నలుగురి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


