breaking news
kullu
-
వరద బీభత్సం.. హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు ధ్వంసమయ్యాయి. ఛండీగఢ్-కులు-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.ప్రధానంగా ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతానికి పండ్లు, కూరగాయలు తీసుకెళ్తున్న వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. హైవేపై చిన్న వాహనాలకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ.. భారీ ట్రక్కులను నిలిపివేశారు. ఆపిల్, టమాటా, ఇతర కూరగాయల లోడ్లు పాడవుతున్నాయని ట్రక్కు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కు లోడ్ విలువ లక్షల్లో ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు.మండి-కుల్లు మధ్యలో కొండచరియల విరిగి పడటంతో సహాయక పనులు చేపట్టారు. క్లియరెన్స్ పనులు కారణంగా ట్రాఫిక్‌కు ఆలస్యమవుతోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. మరమ్మతులు కొనసాగుతున్నాయి. కుల్లు ప్రాంతంలోని రామశిల సమీపంలో వరదల ప్రభావంతో ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. మనాలి ఒక వైపు నుండి ఇతర ప్రాంతాలతో ఉన్న రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపొయాయి.50-km Traffic Jam On Chandigarh-Kullu Highway, Hundreds Of Trucks Stuckapples alone estimated at more than Rs 50 crore stuck in transit.#HimachalPradesh pic.twitter.com/6CCgiRIyus— Sidharth Shukla (@sidhshuk) August 28, 2025మంగళవారం సాయంత్రం నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు, భారీ వర్షాలు, వరదలు కారణంగా సుమారుగా 158 మంది మరణించగా.. 38 మంది గల్లంతయ్యారు.. రూ. 2,623 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. -
పండుగపూట విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
కులు: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని కులు పరిధిలోగల మణికరణ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతిచెందారు. బలమైన గాలుల కారణంగా ఒక భారీ వృక్షం రోడ్డుపై నిలిపివుంచిన వాహనాలపై పడింది. అదే సమయంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.ఈ ప్రమాదంపై హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు(CM Sukhwinder Singh Sukhu) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదప్రాంతంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్ ప్రముఖ మతపరమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆదివారం నాడు రాష్ట్రంలో ‘నవ సంవత్’ ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఎవరన్నదీ ఇంతవరకూ గుర్తించలేదు. పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించినట్లు కులు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అశ్విని కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆదివారం గురుద్వారా ముందు నిలిపివుంచిన తమ వాహనాలలో కూర్చున్న పర్యాటకులపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా? -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్‌లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్‌కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
కులులో ఘనంగా అంతర్జాతీయ దసరా ఉత్సవాలు
విపత్తుల నుంచి కోలుకున్నమూడు నెలల తర్వాత హిమాచల్‌లోని కులులో దసరా సందడి నెలకొంది. అంతర్జాతీయ కులు దసరా వేడుకలు నేటి నుంచి(మంగళవారం) ధాల్పూర్ మైదానంలో ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 30 వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ దసరా ఉత్సవాలు కులు-మనాలిలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకరంగా మారనున్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రఘునాథుని రథయాత్రతో మహాకుంభ్ పేరుతో ఈ దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. రఘునాథుని రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. రథమైదాన్ నుండి రథయాత్ర ‘జై సియారామ్’ నినాదాలతో రఘునాథ్ ధాల్‌పూర్‌కు చేరుకోనుంది. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తీసుకువచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆయా మండపాల్లో కొలువుదీర్చనున్నారు. 14 దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఈ ఉత్సవంలో వివిధ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. దసరా చరిత్రలో తొలిసారిగా మలేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, రొమేనియా, వియత్నాం, కెన్యా, శ్రీలంక, తైవాన్, కిర్గిజిస్తాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నాయని పార్లమెంటరీ చీఫ్ సెక్రటరీ సుందర్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కులు దసరా వేడుకలు 1660 నుండి జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు -
Video: హిమాచల్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే ఇళ్లు నేలమట్టం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలోని అన్నీ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చూస్తూండగానే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బస్టాండ్ సమీపంలోని ఏడు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో..బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల కుప్పకూలడం, భారీగా దుమ్ము లేవడం కనిపిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కులు జిల్లాలోని అన్నీ టౌన్లో ఉన్న భారీ బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో మూడు రోజుల క్రితమే ఆ బిల్డింగ్‌ల నుంచి జనాన్ని తరలించారు. కులు-మండి హైవేపై భారీ వర్షం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎస్ వంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు భారత వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇళ్లు కూలిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. కులులో కొండచరియలు విరిగిపడటంతో భారీ భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కలవరపరిచాయని తెలిపారు. అయితే రెండు రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.ఆ బిల్డింగ్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారని ట్విటర్లో పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: Several buildings collapsed due to landslides in Anni town of Kullu district. (Visuals confirmed by police) pic.twitter.com/MjkyuwoDuJ — ANI (@ANI) August 24, 2023 -
గడ్డకట్టిన జలపాతం.. ఎక్కడో కాదు మన దగ్గరే..!
సిమ్లా: కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర భారత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురవడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో నీరు గడ్డకట్టుకుపోతోంది. హిమాలయాలకు సమీపంలోని హిమాచల్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుండటంతో నీళ్లు గడ్డకట్టుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. హిమాచల్ కులూలోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డకట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. గడ్డకట్టిన జలపాతం అందాలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. On #Udaipur - #Tindi road... Near Bhim bagh 🥶 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat @JATINSKYMET pic.twitter.com/IqLve8xh1I — Gaurav kochar (@gaurav_kochar) January 7, 2023 హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో అతి శీతల వాతావరణంతో గడ్డకట్టిన జలపాతం ఇదీ చదవండి: Joshimath: కుంగుతున్నా వదలట్లేదు -
లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులు జిల్లాలోని బంజార్ సబ్ డివిజన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు టూరిస్టులు మృతి చెందారు. దాదాపు 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘కులు జిల్లా బంజర్ వ్యాలీలోని ఘియాఘి సమీపంలో టూరిస్ట్ వాహనం కొండపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో పది మందికి గాయాలయ్యాయి. అయిదుగురిని కుళ్లులోని జోనల్ ఆసుపత్రికి తరలించాడం. మరో అయిదుగురికి బంజార్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం’మని కులు ఎస్పీ గురుదేవ్ సింగ్ తెలిపారు. బాధితులంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. చదవండి: అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు -
విషాదం: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు, కొందరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ చెప్పారు. సయింజ్ వైపునకు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 ప్రాంతంలో జంగ్లా గ్రామం వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు గార్గ్ వెల్లడించారు. పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్.. తీరా ఓపెన్ చేసి చూస్తే.. -
కులూలో కొనసాగుతున్న రెస్స్క్యూ ఆపరేషన్
-
హిమాచల్ ప్రదేశ్ కులులో వరద బీభత్సం
-
హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం
కులు: హిమాచల్ ప్రదేశ్ లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కులులో ఉదయం 4.12నిమిషాల ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ, భూభౌతిక సంస్ధ వెల్లడించింది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. తక్కువ తీవ్రత వల్లే ఎలాంటి నష్టం సంభవించలేదని పేర్కొంది. కొద్ది రోజుల క్రితం నేపాల్ లో కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే.