సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టిన తల్లి.. తాను విషం కలిపిన ఆహారం తిన్నది. ఈ ఘటనలో తల్లి ప్రసన్న(38), కూతురు మేఘన(13) మృతి చెందగా, కుమారుడు ఆశ్రిత్ రామ్(15) పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.
రెండు నెలల క్రితం ప్రసన్న భర్త ప్రకాశ్ గుండెపోటుతో మృతి చెందగా.. అప్పటి నుంచి భార్య మనస్తాపానికి గురైంది. ప్రసన్న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు.
👉మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com


