breaking news
Mother and two children
-
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టిన తల్లి.. తాను విషం కలిపిన ఆహారం తిన్నది. ఈ ఘటనలో తల్లి ప్రసన్న(38), కూతురు మేఘన(13) మృతి చెందగా, కుమారుడు ఆశ్రిత్ రామ్(15) పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.రెండు నెలల క్రితం ప్రసన్న భర్త ప్రకాశ్ గుండెపోటుతో మృతి చెందగా.. అప్పటి నుంచి భార్య మనస్తాపానికి గురైంది. ప్రసన్న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు.👉మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
విశాఖ జిల్లాలో విషాదం.. అర్ధరాత్రి ఇద్దరు పిల్లలతో..
సాక్షి, విశాపట్నం: ఆర్థిక సమస్యల కారణంగా భార్య, భర్తల మధ్య చేలరేగిన విభేదాలు ఆ కుటుంబాన్ని శోకంలో ముంచింది. అన్నెం, పున్నెం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారుల మరణానికి ఈ ఘటన దారితీసింది. వివరాలిలా ఉన్నాయి. రోలుగుంట మండలం, జె.నాయుడుపాలెంకు చెందిన గడదాసు నాగరాజుకు, అదే మండలం, వడ్డిప గ్రామానికి చెందిన సాయితో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. నాగరాజు ఆటో డ్రైవర్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి భాను(4), పృధ్వీరాజ్(2) జన్మించారు. ఆటో డ్రైవర్ కావడంతో అంతంమాత్రంగా వచ్చే ఆదాయంతో నిత్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో భార్యా, భర్తల మధ్య తరచూ వాగ్వివాదం జరుగుతుండేది. ఇటీవల బంగారం కొనే క్రమంలో వీరిరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వల్ల తన పిల్లలను తీసుకుని భార్య సాయి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. తిరిగి తనే వస్తుందని భావించిన నాగరాజు పట్టించుకోలేదు. అయితే సాయి తన పిల్లలైన భాను, పృధ్వీలను తీసుకుని సమీపంలో ఉండే భావి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలను బావిలో పడేసి, తరువాత తనూ దూకేసింది. చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..) ఈ ఘటనలో చిన్నారులు మృతి చెందగా, దూకిన తరువాత భయపడ్డ తల్లి సాయి బావిలో మెట్టుపట్టుకుని వేలాడుతూ ఉండిపోయింది. ఉదయం అటుగా వస్తున్న మనుషుల శబ్ధం విని సాయి గట్టిగా కేకలు వేయడంతో అప్పటికే చనిపోయిన చిన్నారులతో పాటు తల్లిని బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి..
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఓ గృహిణి, ఇద్దరు పిల్లలతో బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌దర్వాజా బచ్చన్న దేవాలయం ప్రాంతానికి చెందిన వెంకటరమణ, రంగనగరి సింధూ (28)లు దంపతులు. వీరికి రోహిత్ (5), మోక్షా (4)లు సంతానం ఉన్నారు. కాగా ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు రంగనగరి సింధూ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేయగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..) -
గౌరాపూర్లో దారుణం!
ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ తల్లి ముందు తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసింది. ఆ తరువాత తను కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.


