ఆ లీజు వెనుక అసలు రహస్యం ఏంటి బాబూ?: వడ్డే శోభనాద్రీశ్వరరావు | Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ లీజు వెనుక అసలు రహస్యం ఏంటి బాబూ?: వడ్డే శోభనాద్రీశ్వరరావు

Oct 4 2025 3:15 PM | Updated on Oct 4 2025 4:11 PM

Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu

సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 28న విజయవాడలో సభతో ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పాదయాత్ర ముగియనుంది. ఏపీలో రోజురోజుకీ రైతాంగం భూమి ప్రశ్నార్థకంగా మారుతోందని చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.

తమ భూమి ఉంటుందో ఊడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారని.. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోందంటూ శోభనాద్రీశ్వరరావు దుయ్యబట్టారు. లక్షలాది ఎకరాలు నయా జమీందారులకు కట్టబెడుతున్నారు. విజయవాడలో ఆర్టీసీ స్థలం లూలుకి అప్పగించారు. రూ. 600 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనుక చిదంబర రహస్యం ఏంటి?. లూలు మీద నీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు? వందల కోట్ల ఖరీదైన భూములు ఎలా కట్టబెడతారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.

‘‘ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఆంధ్రా ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని మహాదేవ్ అన్నారు. అక్టోబర్ 8న ఉద్ధానంలోని వెన్నెలవలస, మందస నుంచి ప్రారంభం ప్రారంభం కానుందని.. ప్రతీ చోటా హ్యూమన్ రైట్స్‌కు ప్రజల ద్వారా పిటిషన్లు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. చివరిగా విజయవాడలో 28న బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తామని మహాదేవ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement